ఒంటి చేత్తో వెట్టోరీ అద్భుత క్యాచ్: ట్విట్టర్, వీడియో వ్యాఖ్యలు

వెల్లింగ్టన్‌: ఐసిసి ప్రపంచ కప్ పోటీల్లో పాల్గొంటున్న పాత ఆటగాళ్లలో డేనియల్ వెట్టోరీ ఒక్కడు. కానీ, ఫీల్డింగ్‌లో అత్యద్భుతమైన ప్రదర్శన చూపించడంలో యువ క్రీడాకారులకు ఏ మాత్రం తీసిపోలేదు. వెస్టిండీస్‌పై జరుగుతున్న మ్యాచులో శనివారంనాడు వెట్టోరీ ఒంటి చేత్తో క్యాచ్ పట్టాడు, అదీ ఎడమ చేత్తో ఆ క్యాచ్ అందుకున్నాడు.

36 ఏళ్ల వెట్టోరీ మైదానంలో అత్యంత ప్రతిభావంతమైన ప్రదర్సన కనబరచడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అతను రిటైర్‌మెంట్ అవుతాడని అనుకుంటున్న సమయంలో అతను ప్రదర్సన చూపించాడు. ట్రెంట్ బౌల్ట్ బౌలింగు మొదటి బంతిని బ్యాట్స్‌మన్ గాలిలోకి లేపాడు. దాన్ని వెట్టోరీ అందుకున్నాడు.

 Daniel Vettori

వెస్టిండీస్ బ్యాట్స్‌మన్ మార్లోన్ శామ్యూల్స్ థర్డ్ మ్యాన్ వైపు కొట్టాడు. అక్కడ వెట్టోరీ ఫీల్డింగ్ చేస్తున్నాడు. దాన్ని అత్యంత చాకచక్యంగా వెట్టోరీ అందుకున్నాడు. వాట్ ఎ క్యాచ్ అంటూ వెంటనే ట్విట్టర్‌లో కామెంట్ ట్రెండ్ అవుతూ వచ్చింది.

ఆ క్యాచ్‌ను అందుకుని వెట్టోరీ చాలా సులభమైన క్యాచ్ మాదిరిగా అక్కడ నిలబడ్డాడు. మార్టిన్ గుప్తిల్ 237 పరుగులు చేసి రికార్డు సృష్టించిన విషయం తెలిసింద్. న్యూజిలాండ్ వెస్టిండీస్‌పై ఆరు వికెట్ల 393 పరుగులు చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+