ఇందుకేనా జీతాలు?: చెట్టు కింద వాహనం! పక్కనే పోలీసుల చిందులు(వీడియో)
లక్నో: ఎంతో బాధ్యతతో విధులు నిర్వహించాల్సిన కొందరు పోలీసులు.. డ్యూటీలో ఉండగానే నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఓ చెట్టు కింద తమ వాహనాన్ని ఆపిన పోలీసులు.. పాటలు పెట్టుకుని చిందులేశారు. వీరికి తోడుగా కొందరు యువకులు కూడా వచ్చారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఔర్యా జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది.
కాగా, పోలీసులు చిందేసిన వీడియో వైరల్ కావడంతో ఉన్నతాధికారులు ఈ వ్యవహారంపై విచారణకు ఆదేశించారు. ఈ వీడియోలో ముగ్గురు పోలీసులు ఖాకీ దుస్తోల్లో ఉండి పాటకు అనుగుణంగా చిందులు వేయగా.. మరికొందరు యువకులు వారిని ప్రోత్సహిస్తూ స్టెప్పులేశారు.
#WATCH Uttar Pradesh Police orders inquiry after a video of policemen dancing on duty in Auraiya goes viral pic.twitter.com/bQ6LVB5blZ
— ANI UP (@ANINewsUP) September 18, 2018
పోలీసు దుస్తుల్లో ఉండి విధులను మరచి ఇలా చెట్టుకింద చిందులు వేయడంపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇందుకోసమేన పోలీసులకు జీతాలు ఇస్తున్నది అంటూ మండిపడుతున్నారు.
కాగా, ఈ వీడియోలో ఉన్న పోలీసులు బ్రజేష్ కుమార్, సుబోధ్, కుల్దీప్‌లుగా ఉన్నతాధికారులు గుర్తించారు. ఔర్యా జిల్లాలోని అజిత్‌మాల్ ప్రాంతంలో వారు డ్యాన్సులు వేశారని, అయితే, వారితోపాటు చిందేసిన యువకుల జాడ తెలియరాలేదని అధికారులు అంటున్నారు.

పోలీస్ అధికారి శివరామ్ సింగ్ ఈ వ్యవహారంపై విచారణ జరుపుతున్నారని, అనంతరం సదరు పోలీసులపై చర్యలు తీసుకుంటామని ఔర్యా ఎస్పీ త్రివేణి సింగ్ తెలిపారు. కాగా, బ్రజేష్ కుమార్ తన మేనల్లుడి పుట్టిన రోజు సందర్భంగా అందరికీ స్వీట్లు పంచి ఇలా చిందులేసినట్లు తెలిసింది.












Click it and Unblock the Notifications