వయస్సు నైన్‌టీస్..బస్కీలు చూస్తే నైన్టీన్స్,ఇంతకీ ఎవరీయన?

ఈ మధ్యే అంటే జూన్ 21న అంతర్జాతీయ యోగా జరుపుకున్నాం. యోగాతో మనిషి చాలా ఆరోగ్యకరంగా ఉంటాడనేది జగమెరిగిన సత్యం. అయితే ఓ రిటైర్డ్ ఎయిర్ మార్షల్ మాత్రం 90 ఏళ్ల వయస్సులోను తనలో సత్తా ఏమాత్రం తగ్గలేదని నిరూపిస్తున్నాడు. వయస్సు దేహానికే కానీ మనస్సుకు కాదని చెబుతున్నారు. ఇంతకీ ఆ ఎయిర్ మార్షల్ ఎవరో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

old man pull ups

ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న వృద్ధుడి పేరు పీవీ అయ్యర్. ఎయిర్ మార్షల్‌గా రిటైర్ అయ్యారు. 90 ఏళ్ల వయస్సులో కూడా ఈజీగా బస్కీలు తీస్తున్నారు. ఇతన్ని చూసిన వారు వావ్ అని నోళ్లెల్లబెడుతున్నారు. ఇక పీవీ అయ్యర్ బస్కీలు తీస్తుంటే కుర్రకారు కూడా బలాదూర్ అనాల్సిందే. అంతలా ఎంతో ఉత్సాహంగా బస్కీలు తీస్తున్నారు. అయ్యర్ తీస్తున్న బస్కీలను తాగునీరు శాఖ కార్యదర్శి పరమ్ అయ్యర్ వీడియో రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. పరమ్ అయ్యర్ పీవీ అయ్యర్ కుమారుడే.

పీవీ అయ్యర్ బస్కీలు తీస్తున్న వీడియోను పోస్టు చేసి కింద ఇలా రాశారు పరమ్ అయ్యర్. "90 ఏళ్ల వయస్సులో కూడా నా తండ్రి బస్కీలు తీస్తున్నారు. ఇది వయస్సుతో సంబంధం లేకుండా చేయాలి. మేము కూడా ఈ వయస్సులో బస్కీలను చేయలేము. అలాంటిది ఆయన చేయడం నిజంగా గొప్పగా భావిస్తున్నాం." అని పరమ్ అయ్యర్ రాశారు. వీడియోను ట్విటర్‌లో పోస్టు చేసిన కొద్ది క్షణాల్లోనే వైరల్‌గా మారింది. పలువురిని ఆకట్టుకుంది. చాలామంది తమదైన శైలిలో కామెంట్లు రాశారు. ఓ యువకుడు ఈ వీడియో చూసి తన వయస్సు 29 ఏళ్లని రెండు బస్కీలకంటే ఎక్కువ తీయలేనని చెప్పుకొచ్చాడు. నిజంగానే అయ్యర్ మాకు స్ఫూర్తి అని రాసుకొచ్చాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+