పునీత్ ఫిట్: యశ్‌తో కలిసి స్టెప్పులు.. వీడియో వైరల్

పునీత్ రాజ్ కుమార్ ఇక లేరనే విషయాన్ని అభిమానులు జీర్జించుకోలేకపోతున్నారు. జిమ్ చేస్తూ హఠాత్తుగా కుప్పకూలిన ఆయనను ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉందని భావించి ఆ తరువాత బెంగుళూరులోని విక్రమ్ హాస్పిటల్‌కు తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆరోగ్యపరంగా ఎలాంటి సమస్యలు లేని ఆయన.. సడెన్‌గా గుండెపోటుతో మృతి చెందడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.

డ్యాన్స్

డ్యాన్స్

రెండు రోజుల క్రితం ఆయన ఓ ఈవెంట్‌లో కన్నడ స్టార్‌ యశ్‌తో కలిసి డాన్స్‌ చేశాడు. శివరాజ్‌ కుమార్‌ హీరోగా ఏ.హర్ష తెరకెక్కించిన చిత్రం 'జై భజరంగి 2'.తెలుగు, కన్నడ భాషల్లో ఈనెల 29న విడుదలైంది. రెండు రోజుల కిత్రం మూవీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి పునీత్‌ రాజ్‌కుమార్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఆయనతో పాటు కన్నడ స్టార్‌ హీరో యశ్‌ కూడా ఈవెంట్‌కి వచ్చాడు.

స్టెప్పులు వేసి

స్టెప్పులు వేసి

స్టెజ్‌పై శివరాజ్‌, యశ్‌లతో కలిసి పునీత్‌ డాన్స్‌ చేశాడు. స్టార్‌ హీరోలైనప్పటికీ.. ఒకరి సినిమాకి మరొకరు సహాయం చేసుకోవడం పట్ల అభిమానులు హర్షం వ్యక్తం చేశారు. ఇలా చాలా యాక్టివ్‌గా ఉన్న పునీత్‌ రాజ్‌కుమార్‌.. సడెన్‌గా గుండెపోటుతో మరణించడం అభిమానులు జీర్జించుకోలేకపోతున్నారు. ప్రస్తుతం ఈ డాన్స్‌ వీడియో వైరల్‌ అవుతోంది.

దిగ్బ్రాంతి

దిగ్బ్రాంతి

శాండల్ వుడ్ నటుడు పునీత్ రాజ్ కుమార్ హఠాన్మరణం దిగ్బ్రాంతికి గురిచేసింది. సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. జూనియర్ ఎన్టీఆర్ కూడా స్పందించారు. గుండె పగిలినంత పనైందని తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఇంత త్వరగా వెళ్లిపోతావనుకోలేదు సోదరా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. 2016లో విడుదలైన పునీత్ రాజ్ కుమార్ చిత్రం 'చక్రవ్యూహ'లో జూనియర్ ఎన్టీఆర్ 'గెలియా గెలియా' అనే గీతాన్ని ఆలపించారు. ఇందుకుగాను ఎన్టీఆర్‌కు 'మిర్చి మ్యూజిక్ అవార్డు' కూడా లభించింది.

Recommended Video

    గాంధీ భవన్ లో సాంప్రదాయబద్దంగా బతుకమ్మ వేడుకలు || Oneindia Telugu
    చిన్న కుమారుడు

    చిన్న కుమారుడు

    కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ కుమారుడు పునీత్. చిన్న కుమారుడు అయినా.. బాల్య నటుడిగా కూడా నటించారు. రాజ్ కుమార్ కిడ్నాప్ అయిన సమయంలో వీరప్పన్ బృందంతో పునీత్ చర్చలు జరిపారని అంటారు. పెద్ద మొత్తంలో నగదు కూడా ఆఫర్ చేసినట్టు సమాచారం.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+