Video Viral:ఫుల్‌గా తాగేసి తన్నేసుకున్న పోలీసులు, విస్తుపోయిన సామాన్య ప్రజలు

జలౌన్: ప్రజలకు అండగా ఉండాల్సిన పోలీసులే క్రమశిక్షణ తప్పారు. ఒకరు ఫూట్‌గా తాగి మరొకరిని చితకబాదిన ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లోని జలౌన్‌లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే... ఉత్తర్ ప్రదేశ్‌లోని జలౌన్‌లో ఓ పోలీసు కానిస్టేబుల్ మద్యం సేవించాడు. తాగిన మత్తులో తనపై తాను నియంత్రణ కోల్పోయాడు. ఏం చేస్తున్నాడో తెలియలేదు. మరో హోంగార్డుపై విరుచుకుపడ్డాడు. దీంతో ఆ హోంగార్డు కూడా ఈ కానిస్టేబుల్‌పై రివర్స్ అటాక్‌కు దిగాడు. ఇద్దరూ ఓ అరగంట పాటు నడిరోడ్డుపై తన్నుకున్నారు. వారు ప్రయాణిస్తున్న జీపును ఆపి మరీ కొట్టుకున్నారు. అక్కడే ఉన్న స్థానికులు వీరు కొట్టుకుంటున్న దృశ్యాన్ని తమ ఫోన్ కెమెరాలో బంధించారు.

ఈ ఇద్దరు పోలీసులు ఘర్షణకు దిగిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో ఈ ఇద్దరు పోలీసులను సస్పెండ్ చేశారు ఉన్నతాధికారులు.కానిస్టేబుల్ ధరమ్‌వీర్ సింగ్ మరియు హోంగార్డు సునీల్ కుమార్‌లు ముందుగా ఒకరి జుట్టు ఒకరు పట్టుకుని ఆ పై గొంతు పట్టుకుని పెనబడ్డారు.అయితే మరో పోలీసు వీరిని విడిపించేందుకు ప్రయత్నించగా అతన్ని ధరమ్‌వీర్ సింగ్ తోసేశాడు.ఆ పై సునీల్‌ను చితకబాదాడు.ఇద్దరూ పోట్లాడుకుంటూ పక్కనే ఉన్న చెట్లలోకి వెళ్లారు. వీరి గొడవను స్థానికులు వీడియో తీశారు.

Video Viral:Two Police have a fight after taking liquor in Uttarpradesh,see what happened

కానిస్టేబుల్ ధరమ్‌వీర్ సింగ్ మరియు హోంగార్డు సునీల్ కుమార్‌లను జిల్లా ఎస్పీ సస్పెండ్ చేశారు. అంతేకాదు వీరిపై డిపార్ట్‌మెంటల్ ఎంక్వైరీకి ఆదేశించారు. ముగ్గురు పోలీసులు ఆ ప్రాంతంలో పాట్రోలింగ్‌కు వెళ్లారని రిపోర్టులో ఉంది. జగమాన్‌పూర్‌లో తాము ప్రయాణిస్తున్న వాహనంను పక్కకు ఆపి మద్యం సేవించినట్లు ఎంక్వైరీలో తేలింది. మద్యం సేవిస్తున్న సమయంలో కానిస్టేబుల్ ధరమ్‌వీర్ సింగ్, హోంగార్డు సునీల్ కుమార్ మధ్య ఏదో అంశంపై వాదనలు జరిగాయి.ఇద్దరూ వాదించుకుంటున్న సమయంలోనే వాహనం నుంచి బయటకు దిగారు. ఒకరిపై ఒకరు తిట్ల దండకం అందుకుని ఇలా ఓ పది నిమిషాల పాటు తిట్టుకున్నట్లు నివేదికలో పేర్కొన్నారు. ఆ తర్వాత ముష్టియుద్ధానికి దిగారని నివేదిక తయారు చేసిన కమాండంట్ రిపోర్టులో పేర్కొన్నారు.

మొత్తానికి ఈ వీడియో వైరల్ అవడంతో ప్రజల సమస్యలు పరిష్కరించాల్సిన పోలీసులే ఇలా సమస్యగా మారితే ఎలా అంటూ నెటిజెన్లు ప్రశ్నిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+