ఫిదా కావాల్సిందే!: ఉద్యోగులతో కలిసి చిందేసిన లేడీ సీఈఓ, నెటిజన్ల ప్రశంసల హోరు
న్యూఢిల్లీ: ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఆ కంపెనీ ఉద్యోగులు ఎంత అదృష్టవంతులో అని ఆ వీడియోను చేసినవారంతా అనుకుంటున్నారు. ఎందుకంటే ఏకంగా ఆ కంపెనీ సీఈవోనే ఉద్యోగులతో కలిసి డ్యాన్సులు చేయడం విశేషం. ఉద్యోగుల్లో ఉత్సాహం నింపిన ఆ సీఈవోపై నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

ఉద్యోగులతో కలిసి చిందేసిన లేడీ సీఈవో..
వివరాల్లోకి వెళితే.. వెల్‌స్పన్ ఇండియా సీఈవో దీపాళి గోయెంకా కార్యాలయంలోని ఉద్యోగులతో కలిసి నృత్యాలు చేశారు. స్ట్రీట్ డ్యాన్సర్‌లోని ముక్కాబులా పాటకు డ్యాన్స్ చేశారు ఈ 50ఏళ్ల సీఈవో, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్. మంగళవారం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో నెటిజన్లు ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

లక్షలకొద్దీ వ్యూస్..
ఆరోగ్యకరమైన పని వాతావరణాన్ని కల్పిస్తున్నారంటూ దీపాళి గోయెంకాపై నెటిజన్లు కొనియాడుతున్నారు. కాగా ఈ వీడియో ట్విట్టర్‌లో ఇప్పటికే లక్షకుపైగా వ్యూస్ సాధించడం గమనార్హం. కార్యాలయంలోనే ఉద్యోగులతో కలిసి సీఈవో డ్యాన్స్ చేయడం ఒక గొప్ప విషయమని వ్యాఖ్యానిస్తున్నారు. ఉద్యోగులు కూడా ఆమెతో కలిసి ఉత్సాహంగా చిందులేశారని కొనియాడారు.
ఇది ఒక అరుదైన పరిణామం..
ఒక సీఈవో ఉద్యోగుల మధ్యకు వెళ్లి వారితో కలిసి డ్యాన్స్ చేయడం అనేది ఒక అరుదైన పరిణామమని ఆర్పీజీ ఎంటర్‌ప్రైసెస్ ఛైర్మన్ హర్ష గోయెంకా ట్విట్టర్ వేదికగా వ్యాఖ్యానించారు. ఇందుకు దీపాళి గోయెంకా ఆయనకు ధన్యవాదాలు తెలిపారు.
మరి మీరంటూ.. ఆనంద్ మహీంద్ర, గౌతమ్ అదానీకి..
కాగా, వెల్‌స్పన్ సీఈఓ దీపాళి గోయెంకా ఆమె డ్యాన్స్ చేసిన వీడియోను ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ప్రముఖ పారిశ్రామికవేత్తలు ఆనంద్ మహీంద్రా, గౌతమ్ ఆదానీ, కిరణ్ మజుందార్ షాలను ట్యాగ్ చేశారు. మా వర్క్‌ప్లేస్‌హ్యాపీ అని తెలిపిన ఆమె.. మరి మీ సంగతేంటి? అని ఆమె ప్రశ్నించారు.
అద్భుతమంటూ.. నెటిజన్ల ప్రశంసలు..
ఇక వీడియో చూసిన చాలా మంది నెటిజన్లు దీపాళి గోయెంకాపై ప్రశంసలు వర్షం కురిపిస్తూనే ఉన్నారు. వేలమంది ఆ వీడియోను లైక్ చేస్తున్నారు. హ్యాపీ, ఫిట్ సీఈవో ఉద్యోగుల్లో ఆనందం నింపారంటూ పలువురు నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఆమె నృత్యం కూడా అద్భుతంగా చేశారంటూ కొనియాడుతున్నారు.
భారతీయ కార్పొరేట్స్ మార్పు..
భారతీయ కార్పొరేట్ రంగంలో మార్పులు చేసుకుంటున్నాయి. పని ప్రాంతంలో ఉద్యోగుల్లో సీఈవో దీపాళి గోయెంకా నృత్యం చేసి ఎంతో ఉత్సాహాన్ని నింపారు. ఇది భారత కార్పొరేట్స్ మార్పుకు నిదర్శనమని అన్నారు సేల్స్ ఫోర్స్ కన్సల్టెంట్ సౌరవ్ దత్.
-
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!!












Click it and Unblock the Notifications