boyfriend: గర్ల్ ఫ్రెండ్ ను చితకబాదిన ప్రియుడు, వీడియో వైరల్, బుల్డోజర్ పంపించిన సీఎం, ఫినిష్ !
భోపాల్/మధ్యప్రదేశ్: చాలాకాలం పాటు యువతితో మోజు తీర్చుకున్న ప్రియుడు తరువాత ఆమెకు హ్యాండ్ ఇవ్వడానికి ప్రయత్నించాడు. అయితే ఆమె మాత్రం తనను పెళ్లి చేసుకోవాలని చెప్పింది. యువతిని ఆమె ప్రియుడు దారుణంగా కొట్టి, తన్నాడు. ఆ సమయంలో కొందరు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చెయ్యడంతో వైరల్ అయ్యాయి. ప్రియురాలిని చిత్రహింసలకు గురి చేసిన ప్రియుడి ఇంటిని నేలమట్టం చెయ్యాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. సీఎం జోక్యం చేసుకున్నారు అంటే ప్రియుడు ఆమెను ఎంత హింసించాడో అర్దం చేసుకోవచ్చు.

ఒకే ఏరియాలో లవర్స్
మధ్యప్రదేశ్ లోని రేవా జిల్లాలోని మౌగంజ్ ప్రాంతంలో నివాసం ఉంటున్న యువతి, అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న పంకజ్ త్రిపాఠి అలియాస్ పంకజ్ (25) అనే యువకుడు ప్రేమించుకున్నారు. ప్రియురాలితో హ్యాపీగా తిరిగిన ఆమె ప్రియుడు పంకజ్ ఆమెతో పెళ్లికి ముందే శారీరక సంబంధం పెట్టుకుని ఎంజాయ్ చేశాడు. చాలాకాలం పాటు యువతితో మోజు తీర్చుకున్న పంకజ్ తరువాత ఆమెకు హ్యాండ్ ఇవ్వడానికి ప్రయత్నించాడు. అయితే ఆమె మాత్రం తనను పెళ్లి చేసుకోవాలని పంకజ్ కు తేల్చిచెప్పింది.

వీడియో వైరల్
పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేస్తున్న ప్రియురాలిని ఆమె ప్రియుడు పంకజ్ దారుణంగా కొట్టి ఆమె తన్నాడు. ఆ సమయంలో కొందరు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చెయ్యడంతో వైరల్ అయ్యాయి. పంకజ్ షాకింగ్ వీడియో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వైరల్ అవుతున్న వీడియోలో ఉన్న ఇద్దరూ ప్రేమికులని, పంకజ్ ను పెళ్లి చేసుకోవాలని అతని ప్రియురాలు బలవంతం చేసిన ఆడియో కూడా క్లియర్ గా ఉండటంతో అందరూ షాక్ అయ్యారు.

వీడియోలు తీశారు కాని ఎవ్వరూ ?
తన ప్రియురాలి పెళ్లి ప్రతిపాదనకు పంకజ్ నిరాకరించాడు. ప్రియురాలు పట్టుబట్టడం కొనసాగించింది. దీంతో కోపోద్రిక్తుడైన పంకజ్ అతని ప్రియురాలిని కొట్టడం మొదలుపెట్టాడు. ప్రియురాలు అదుపుతప్పి కిందపడడంతో పంకజ్ ఆమెను కిందపడేసి తన్ని దారుణంగా దాడి చేశాడు. పంకజ్ దారుణాన్ని చుట్టుపక్కలవారు సెల్‌ఫోన్‌లలో రికార్డు చేశారు. అదే సమయంలో పంకజ్ ను ఎవరూ ఆపి ప్రశ్నించకపోవడంతో అతను ఇంకా రెచ్చిపోయాడు.

ఉత్తరప్రదేశ్ కు జంప్
వీడియో వైరల్ కావడంతో, మధ్యప్రదేశ్ పోలీసులు ముందుకు వచ్చి పంకజ్ మీద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పంకజ్ త్రిపాఠి డ్రైవర్ అని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. తన మీద కేసు నమోదు అయ్యిందని తెలుసుకున్న పంకజ్ ఊరు వదిలి తప్పించుకుని ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్‌లో తలదాచుకున్నాడు.

లవ్ మ్యాటర్ లో సీఎం ఎంట్రీతో సినిమా
మధ్యప్రదేశ్ పోలీసులు ఉత్తరప్రదేశ్ లో పంకజ్ ఉన్న ప్రదేశాన్ని ట్రేస్ చేసి అరెస్టు చేశారు. తరువాత మధ్యప్రదేశ్ ప్రభుత్వ ఆదేశాల మేరకు రేవా జిల్లా పోలీసు యంత్రాంగం బుల్డోజర్‌తో రేవాలోని ప్రియుడు పంకజ్ ఇంటిని కూల్చివేసింది. ఈ బుల్డోజర్ శిక్షపై రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఓ ట్వీట్ చేశారు. రేవా జిల్లాలోని మౌగంజ్ ప్రాంతంలో యువతితో క్రూరంగా ప్రవర్తించిన కేసులో నిందితుడు పంకజ్ త్రిపాఠిని అరెస్టు చేసి అతని ఇంటిని బుల్డోజర్‌తో నేలమట్టం చేశామని ట్వీట్ చేశారు. డ్రైవర్ పంకజ్ లైసెన్స్ కూడా రద్దు చెయ్యాలని సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఆదేశాలు జారీ చేశారు.

ఒళ్లు దగ్గర పెట్టుకోండి.... లేదంటే బుల్డోజర్ వస్తోంది
మధ్యప్రదేశ్‌లో మహిళలపై ఎవరు నేరాలకు పాల్పడినా శిక్ష నుంచి తప్పించుకోలేరనిని గట్టిగా చెప్పడానికి నిందితుడు పంకజ్ ఇంటిని ధ్వంసం చేశామని సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ అంటున్నారు. నేరస్తులకు గట్టిగా బుద్ది చెప్పడానికి వారి ఇళ్లను బుల్డోజర్ తో కూల్చి వేసే శిక్షను మొదట ఉత్తరప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం మొదలు పెట్టింది. తరువాత మధ్యప్రదేశ్, బీహార్, అస్సాం రాష్ట్ర ప్రభుత్వాలు కూడా బుల్డోజర్ శిక్షను అనుసరించడం మొదలుపెట్టాయి.












Click it and Unblock the Notifications