షాకింగ్ వీడియో ట్వీట్ చేసిన కమల్ హాసన్, పోలీసులే ఇలా, ఛీ !
చెన్నై: జల్లికట్టు ఉద్యమం హింసాత్మకంగా మారిన నేపథ్యంలో చెన్నై నగరంలో ఓ పోలీసు దారుణంగా ప్రవర్థించిన ఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. జల్లికట్టు ఉద్యమంలో పాల్గోన్న విద్యార్థులకు చెడ్డపేరు తీసుకురావడానికి పోలీసులు ఇలా చేశారని పలువురు ప్రముఖులు మండిపడుతున్నారు.
జల్లికట్టు ఉద్రిక్తతల నేపథ్యంలో ఏకంగా ఓ పోలీసు ఆటోకు నిప్పు పెడుతున్న ఓ వీడియో ఇప్పుడు వైరల్ అయ్యింది. స్థానిక చానెళ్లు పదేపదే ఆ క్లిప్పంగులు ప్రసారం చెయ్యడంతో ఆ వీడియోను ప్రముఖ సినీ నటులు కమల్ హాసన్, అరవింద్ స్వామి తదితరులు ట్వీట్ చేశారు.
ఏంటీ ఇది ? పోలీసులే ఆటోలకు, వాహనాలకు నిప్పంటిస్తారా ? అంటూ విస్మయం వ్యక్తం చేశారు. ఇలాంటి పోలీసుల వలన తమిళనాడుకు చెడ్డపేరు వస్తుందని విచారం వ్యక్తం చేశారు. సోమవారం చెన్నైలో జల్లికట్టు ఆందోళన హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే.

ఆ సమయంలో మెరీనా బీచ్ రణరంగంగా మారిపోవడంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఈ నేపథ్యంలో ఓ పోలీసే ఆటోకు నిప్పంటించడంతో సంచలనం రేపింది. ఈ వీడియో చూసిన పోలీసు అధికారులు భిన్నంగా స్పందించారు.
ఇది మార్ఫింగ్ చేసిన వీడియో అని దర్యాప్తు చేస్తున్నామని పోలీసు అధికారి (డీజీపీ) టీకే. రాజేంద్రన్ చెప్పారు. ఇలాంటి అసాంఘిక చర్యలకు ఎవరూ పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని, సాటి పోలీసులు అని కూడాచూడమని సీనియర్ పోలీసు అధికారి కే. శంకర్ మీడియాకు చెప్పారు. మొత్తం మీద ఓ పోలీసు చేసిన పనికి చెన్నై నగర పోలీసులు చెడ్డపేరు మూటకట్టుకున్నారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications