టిపై సుష్మ, అద్వానీ: విద్యాసాగర రావు కంటతడి
న్యూఢిల్లీ: తెలంగాణకు మద్దతిచ్చామని, ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పార్టీ పాత్ర ఎంతో ఉందని, పార్లమెంటుకు బిల్లు వచ్చాక వెనక్కి పోయే పరిస్థితి రావొద్దని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి విద్యాసాగర రావు కన్నీరు పెట్టుకున్నారు. తెలంగాణ విషయంలో పార్టీ అగ్రనేతలు లాల్ కృష్ణ అద్వానీ, సుష్మా స్వరాజ్‌లు చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.
దీంతో తెలంగాణ ప్రాంతానికి చెందిన బిజెపి నేతలు హుటాహుటిన జాతీయ అధ్యక్షులు రాజ్‌నాథ్ సింగ్ వద్దకు వెళ్లారు. తమ గోడు వెళ్లబోసుకున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి, మాజీ మంత్రులు బండారు దత్తాత్రేయ, విద్యాసాగర రావు, ఎమ్మెల్యేలు యెండల లక్ష్మీనారాయణ, నాగం జనార్ధన్ రెడ్డి, యెన్నం శ్రీనివాస్ రెడ్డి తదితరులు అధ్యక్షులను కలిశారు.

సుష్మా స్వరాజ్, అద్వానీలు చేసిన వ్యాఖ్యలను వారు ప్రస్తావించారు. ఇన్నాళ్లు తెలంగాణ కోసం బిజెపి ఎంతో పోరాడిందని చెప్పారు. వారి ప్రకటనలతో తెలంగాణలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పార్టీ వైఖఱిపై స్పష్టత ఇవ్వాలని కోరారు. దీంతో రాజ్‌నాథ్ రాత్రికి అప్పుడే స్పష్టమైన ప్రకటన చేశారు.
తెలంగాణ విషయంలో తమకు అయోమయం లేదని, యూటర్న్ తీసుకోలేదని, మేం ప్రత్యేక తెలంగాణకు కట్టుబడి ఉన్నామని, ఈ విషయంలో తమ వైఖరి సుస్పష్టమని చెప్పారు. ఇదే సమావేశాల్లో విభజన బిల్లు ఆమోదం పొందాలని భావిస్తున్నామన్నారు. అందుకు మద్దతు ఇస్తామని, అయితే సీమాంధ్ర ప్రయోజనాలను పరిరక్షించాలన్నారు.పార్టీ అధ్యక్షుడిగా తాను మాత్రం ఇదే సమావేశాల్లో తెలంగాణ బిల్లు ఆమోదం పొందాలనుకుంటున్నానని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications