ఫలితాల ముందే విజయ్ కు బిగ్ ఆఫర్, కొత్త ఫార్ములా- TVK మద్దతు వారికే..!?
తమిళనాడులో ఫలితాలకు ముందే కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. విజయ్ కీలక పాత్ర పోషించటం ఖాయంగా కనిపిస్తోంది. పోలింగ్ సరళి తరువాత అందరి అంచనాలు తల కిందులు అయ్యాయి. భారీగా పోలింగ్ తరువాత రెండు ప్రధాన కూటముల నేతలు నియోజకవర్గాల వారీగా విశ్లేషణలు చేసారు. ఫలితం పైన అంచనాకు వచ్చేసారు. ఇక.. ఇప్పుడు విజయ్ వద్దకు కీలక నేతలు కొత్త ప్రతిపాదనలు.. ఫార్ములాతో వస్తున్నారు. అయితే.. తన మద్దతు అవసరమైతే ఎవరికి అండగా నిలవాలో విజయ్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
తమిళనాడులో కొత్త చరిత్ర. తొలి సారి రాజకీయ బరిలోకి దిగిన విజయ్ పై మరింత పెరిగిన అంచనాలు. గతంలో ఎన్నడూ లేని విధంగా పెరిగిన ఓటింగ్ తో ప్రధాన పార్టీల్లో టెన్షన్ మొదలైంది. ఒక కీలక పార్టీ పునాదులు కదులుతున్నాయనే అంచనాలు వినిపిస్తున్నాయి. యువత.. మహిళలు పోలింగ్ కేంద్రాల వద్ద పోటెత్తారు. దీంతో.. ఓటింగ్ సరళి పైన పార్టీలకు ఇప్పటికే స్పష్టత వచ్చింది. ఈ ఎన్నికలు తమిళనాడులో కొత్త చరిత్ర క్రియేట్ చేయటం ఖాయంగా కనిపిస్తోంది. 85 శాతానికి పైగా ఓటింగ్ నమోదైంది.

ఈ మార్పు ద్రవిడ రాజకీయాల ముఖచిత్రాన్నే మార్చేస్తోంది. ఈ పోలింగ్ శాతం.. ఓటింగ్ సరళి.. ఓటర్ల నాడి పార్టీలకు స్పష్టత ఇచ్చింది. సర్వే రిపోర్టులు సిద్దం అయ్యాయి. అయితే, ఇప్పటి వరకు వచ్చిన ఒపీనియన్ పోల్స్ కు భిన్నంగా విజయ్ కు ఓటర్లు మద్దతుగా నిలిచినట్లు అంచనాలు వినిపిస్తున్నాయి. దీంతో..ఎక్కడ చూసినా విజయ్ ఫ్యాక్టర్ పైనే చర్చ జరిగింది. అన్ని పోలింగ్ కేంద్రాల్లోనూ యువత.. మహిళలు పెద్ద సంఖ్యలో కనిపించారు.
పోలింగ్ తరువాత వెల్లడవుతున్న అంచనాల మేరకు యువత ఏకపక్షంగా విజయ్ వైపు మొగ్గు చూపి ఉంటే, అది సంప్రదాయ పార్టీలైన డీఎంకే, అన్నాడీఎంకేల పునాదులను కదిలించడం ఖాయమనే విశ్లేషణలు మొదలయ్యాయి. తమిళనాడు చరిత్రలో మహిళా ఓటర్లు ఎప్పుడూ ఒక నిర్ణయాత్మక శక్తిగానే నిలిచారు. డీఎంకే, అన్నా డీఎంకేలను అధికారంలోకి తీసుకురావటంలోనూ.. ఓడించటం లోనూ వారే డిసైడింగ్ ఫ్యాక్టర్. కాగా, ఇప్పుడు వీరు మార్పు కోరుకుంటున్నారా అనే విధంగా పోలింగ్ జరిగింది. విజయ్ కు భారీగా ఉన్న ఫ్యాన్ బేస్ పూర్తిగా ఈ ఎన్నికల్లో పని చేసినట్లు కనిపిస్తోంది.
విజయ్ కు ఈ ఎన్నికల్లో 20 శాతం వరకు ఓట్లు వచ్చే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. అంతకంటే విజయ్ కు ఎక్కువగా పోలింగ్ జరిగి ఉంటే మాత్రం.. ఖచ్చితంగా సీఎం ఎవరనేది డిసైడ్ చేసే అవకాశం విజయ్ చేతికి చిక్కుతుంది. దీని పైన విజయ్ ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో.. ఈ అంచనాలు డీఎంకే, ఎన్డీఏ కూటమిని టెన్షన్ పెడుతు న్నాయి. కాగా.. అసలు ఓటర్లు ఎవరికి పట్టం కట్టారనేది మే 4న వెల్లడి కానుంది. అప్పటి వరకు నిరీక్షించాల్సిందే.












Click it and Unblock the Notifications