విజయ్ కేబినెట్ ఇదే..! హోం మంత్రి ఎవరంటే..?
తమిళనాడు ముఖ్యమంత్రిగా టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ ప్రమాణస్వీకారానికి మరికొన్ని గంటలే మిగిలి ఉంది. రేపు ఉదయం 10 గంటలకు చెన్నైలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో విజయ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు 9 మంది మంత్రులు రేపు ప్రమాణం చేయనున్నారు. తాజాగా విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈమేరకు సుమారు 2 గంటలకు పైగా చర్చలు జరిగాయి. చర్చల్లో భాగంగా తనకు మద్దతు ఇస్తున్న పార్టీల లేఖలను విజయ్ గవర్నర్ కు సమర్పించారు. కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, వీసీకే, ఐయూఎంఎల్ పార్టీలు మద్దతిస్తున్నట్లు అందులో పేర్కొన్నారు. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ అనుమతి ఇచ్చారు. తమిళనాడు సీఎంగా విజయ్‌ను నియమిస్తూ లేఖను అందజేశారు. అలాగే ఈనెల 13లోపు అసెంబ్లీలో బలనిరూపణ చేసుకోవాలని గవర్నర్ స్పష్టం చేశారు.
#BREAKING || ➤ தவெக அமைச்சரவையில் இடம்பெறுவோர் யார்? யார்? - உத்தேச பட்டியல்
— Polimer News (@polimernews) May 9, 2026
➤ பொது நிர்வாகம், காவல் மற்றும் உள்துறை - விஜய்
➤ பொதுப்பணித்துறை - செங்கோட்டையன்
➤ நகராட்சி நிர்வாகத்துறை - என்.ஆனந்த்
➤ மின்சாரத்துறை - சி.டி.ஆர். நிர்மல்குமார்
➤ விளையாட்டு மற்றும் மது…
మరోవైపు విజయ్ అనే నేను అంటూ సీఎంగా ప్రమాణస్వీకారం చేసే క్షణం కోసం దళపతి ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా టీవీకే కార్యకర్తలు, అభిమానులు బాణసంచా కాల్చి సంబరాలు చేసుకుంటున్నారు. ఇక విజయ్ కేబినెట్ మంత్రులు ఖరారు అయినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఓ లిస్టు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఆ లిస్టులో తెలిపిన వివరాల ప్రకారం సీఎం పదవితోపాటు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, హోం మంత్రి శాఖలను విజయ్ తన వద్దే పెట్టుకోనున్నారు. అలాగే పబ్లిక్ వర్క్స్ డిపార్ట్ మెంట్ శాఖకు మంత్రిగా సెంగొట్టయాన్, అర్బన్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్ మెంట్ శాఖకు ఎన్. ఆనంద్, విద్యుత్ శాఖ మంత్రిగా సీడీఆర్ నిర్మల్ కుమార్, స్పోర్ట్స్ అండ్ ప్రొహిబిషన్ డిపార్ట్ మెంట్ మంత్రిగా ఆధవ్ అర్జున ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు సమాచారం.

అలాగే ఆది ద్రవిడ సంక్షేమ శాఖ మంత్రిగా రాజ్ మోహన్, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రిగా ముస్తాఫా, రిజిస్ట్రేషన్ అండ్ కమర్షియల్ టాక్స్ డిపార్ట్ మెంట్ మంత్రిగా అరుణ్ రాజ్, విద్యాశాఖ మంత్రిగా వెంకట రామన్ పేర్లను ఖరారు చేసినట్లు సమాచారం అందుతోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అంతేకాక విజయ్ కేబినెట్ లోకి ఇద్దరు మహిళలు కూడా రానున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు విజయలక్ష్మి, కీర్తన లకు అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఇక కీలకమైన ఆర్థిక శాఖను కూడా విజయ్ తన వద్దే ఉంచుకోనున్నట్లు తెలుస్తోంది. ఇక మొత్తం 234 అసెంబ్లీ స్థానాలున్న తమిళనాడులో రాజ్యాంగం ప్రకారం మంత్రివర్గంలోకి 35 మందిని తీసుకోవడానికి అవకాశం ఉంది. రానున్న రోజుల్లో మరింత మంది నాయకులు విజయ్ కేబినెట్ లో చేరనున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications