జయలలిత మృతి: హీరో విజయ్ సినిమా వేడుక రద్దు
జయలలిత మృతి నేపథ్యంలో విజయ్ సినిమా ఆడియో వేడుకను రద్దు చేస్తున్నట్లు భైరవ సినిమా నిర్మాతలు సోమవారం నాడు వెల్లడించారు.
చెన్నై: తమిళ స్టార్ విజయ్ కొత్త సినిమా భైరవ ఆడియో వేడుక రద్దయింది. ఇటీవల జయలలిత మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విజయ్ సినిమా ఆడియో వేడుకను రద్దు చేస్తున్నట్లు భైరవ సినిమా నిర్మాతలు సోమవారం నాడు వెల్లడించారు.
జయలలిత తర్వాత శశికళ: 'ఏపీ-తెలంగాణలో ఇదే పరిస్థితి, తెలుగు రాష్ట్రాలకు గుణపాఠం'విజయ్ నటించిన ఈ సినిమా ఆడియోను నేరుగా మార్కెట్‌లోకి విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు బి వెంకట్రామ రెడ్డి, బి. భారతి రెడ్డిలు తెలిపారు.

జయలలిత మృతితో విజయ్ కూడా ఆడియో విడుదల కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించొద్దని అడిగారని, కాబట్టి డిసెంబరు 23న పాటలను నేరుగా మార్కెట్‌లోకి విడుదల చేస్తున్నామని, జయలలితను తమ కుటుంబంలోని ఓ సభ్యురాలిగా భావించామని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని నిర్మాతలు తెలిపారు. జయలలిత నిన్నటి తరం హీరోయిన్ అని కూడా గుర్తు చేశారు.












Click it and Unblock the Notifications