తమిళనాడులో అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాలు: మెజారిటీ మార్క్ కు చేరువగా టీవీకే?

తమిళనాడులోని మదురాంతకం, ధరాపురం అసెంబ్లీ నియోజకవర్గాల ఉపఎన్నికల ఫలితాల లెక్కింపునకు సర్వం సిద్ధమైంది. ఈ ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ఆరంభమౌతుంది. సరిగ్గా నాలుగు నెలల కిందటే అధికార పీఠాన్ని దక్కించుకున్న విజయ్‌కు సారథ్యంలోని టీవీకే ప్రభుత్వానికి ఈ ఉపఎన్నికలు మొదటి పరీక్షగా నిలిచాయి. దీంతో ఈ ఫలితాలపైనే అందరి చూపూ నిలిచింది. రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

ఈ రెండు నియోజకవర్గాలకు ఈ నెల 6వ తేదీన పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. ప్రత్యేకించి మధురాంతకంలో రికార్డు స్థాయిలో 86.26 శాతం పోలింగ్ నమోదైంది. ఇక్కడ మొత్తం 1,84,423 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ధరాపురం నియోజకవర్గంల పరిధిలో 80.25 శాతం పోలింగ్ నమోదు కాగా, 1,79,214 ఓట్లు పోల్ అయ్యాయి. ఈ నియోజకవర్గాల్లో పెరిగిన ఓటింగ్ శాతం ఇప్పుడు ప్రధాన పార్టీల భవితవ్యాన్ని తేల్చనుంది.

Vijay Government Early Test as Madurantakam and Dharapuram Votes to Be Counted From 8 AM Today

ప్రధాన అభ్యర్థులు వీరే

మధురాంతకం, ధారాపురంలల్లో త్రిముఖ పోరు నెలకొంది. అధికార టీవీకే నుంచి మరగతం కుమారవేళ్ పోటీ పడగా, డీఎంకే తరపున పరంథామన్, ఏఐఏడీఎంకే నుంచి కనిత సంపత్ బరిలో నిలిచారు. ఎన్‌టీకే తరపున జానకీ రామన్, సీపీఎం నుంచి సుగంధి పోటీలో ఉన్నారు. ధరాపురంలో టీవీకే తరపున సత్యభామ, డీఎంకే అభ్యర్థిగా సుగన్య, ఏఐఏడీఎంకే నుంచి భానుమతి మధ్య హోరాహోరీ పోరు నెలకొంది.

9 నెలల్లో 9 కోట్లు దాటిన అన్నప్రసాద వితరణ: తిరుమలలో శాటిలైట్ ఆటోమేటెడ్ కిచెన్
9 నెలల్లో 9 కోట్లు దాటిన అన్నప్రసాద వితరణ: తిరుమలలో శాటిలైట్ ఆటోమేటెడ్ కిచెన్

మెజారిటీ మార్క్ కు మరింత చేరువ

ఈ రెండూ కూడా ఏఐఏడీఎంకేకు చెందిన స్థానాలు. మే లో జరిగిన ఎన్నికల్లో ఏఐఏడీఎంకే నుంచి గెలిచిన అభ్యర్థులు రాజీనామా చేయడం వల్ల ఈ ఉప ఎన్నికలు అవసరం అయ్యాయి. వారిద్దరూ కూడా ఈ సారి టీవీకే అభ్యర్థులుగా బరిలో నిలిచారు. ఈ రెండింటినీ గెలిస్తే.. అసెంబ్లీలో టీవీకే సీట్ల సంఖ్య 110కి చేరుతుంది. మెజారిటీ మార్క్ కు మరింత చేరువ అవుతుంది.

ఓట్ల లెక్కింపు మొత్తం 23 రౌండ్లలో పూర్తి అవుతుంది. మొదట పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. అనంతరం ఈవీఎంలను ఓపెన్ చేస్తారు. అన్ని పార్టీల నాయకులు, కార్యకర్తలు కౌంటింగ్ కేంద్రాలకు భారీగా తరలివచ్చే అవకాశం ఉండటంతో పోలీసులు పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకున్నారు. ఎలాంటి అవాंఛనీయ సంఘటనలు జరగకుండా నివారించడానికి మూడంచెల భద్రతా వలయాన్ని ఏర్పాటు చేశారు.

బెంగాల్ లో ఇదే సీన్..

అటు ముఖ్యమంత్రి సువేందు అధికారి సారథ్యంలో అధికారంలో ఉన్న పశ్చిమ బెంగాల్‌లో ఇదే పరిస్థితి నెలకొంది. నందిగ్రామ్, రెజినగర్ అసెంబ్లీ స్థానాలకు ఇక్కడ పోలింగ్ జరిగింది. ఈ రెండు చోట్ల కూడా 80 శాతం వరకు పోలింగ్ నమోదైంది. మే నాటి ఎన్నికల్లో భవానీపూర్, నందిగ్రామ్ లల్లో పోటీ చేసిన సువేందు.. రెండు చోట్లా గెలిచారు. నందిగ్రామ్ కు రాజీనామా చేశారు. ఫలితంగా ఇక్కడ ఉప ఎన్నిక అవసరమైంది. హసిరాణి రథ్ ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఇక్కడ టీఎంసీ పోటీలో లేదు గానీ కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ప్రకటించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+