రజనీకాంత్-కమల్‌ల కంటే ముందే విజయ్ రాజకీయాల్లోకి రావాలనుకున్నారు కానీ: తండ్రి

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై: సినీ సూపర్ స్టార్స్ రజనీకాంత్, కమల్ హాసన్‌ల కంటే ముందే తన తనయుడు హీరో విజయ్ రాజకీయాల్లోకి రావాలని భావించారని ఆయన తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ప్రస్తుతం నటులంతా రాజకీయాల వైపు వస్తున్నారని, అందుకే విజయ్ ప్రస్తుతం రావటం లేదని అభిప్రాయపడ్డారు.

రజనీకాంత్‌, కమల్‌ హాసన్‌ రాజకీయాల్లోకి వచ్చారని, ఇప్పుడు విజయ్‌ కూడా వస్తే సినిమా నటులు అందరూ రాజకీయాల వైపు ఎందుకు వస్తున్నారని ప్రజలు ప్రశ్నిస్తారని ఆయన అన్నారు. కానీ రజనీ, కమల్‌ల కంటే ముందే విజయ్‌ రాజకీయాల్లోకి రావాలనుకున్నాన్నారు.

Vijay had plans to enter politics before Rajinikanth, Kamal Haasan: SA Chandrasekhar

ఇందుకోసం విజయ్‌ అభిమానులు సామాజిక కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించుకున్నారని తెలిపారు. ఓ తండ్రిగా కొన్నేళ్ల క్రితం వాడు రాజకీయాల్లోకి వస్తే బాగుంటుందనుకున్నానని, ఇప్పుడైతే విజయ్‌కి రాజకీయాల్లోకి వచ్చే ఆలోచనలు లేవని చెప్పారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Filmmaker SA Chandrasekhar feels Vijay venturing into politics right now might make Tamil audience angry as recently his seniors, Kamal Haasan and Rajinikanth, have also stepped into the field with their respective parties.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X