నరేంద్రమోడీకి హీరో విజయ్ లేఖ, తప్పుఅడ్రస్ ఇచ్చారు
చెన్నై: ప్రముఖ తమిళ హీరో విజయ్ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఇటీవల లేఖ రాశారు. సినిమాల పైన సర్వీస్ ట్యాక్స్ ఎత్తివేయాలని కోరుతూ విజయ్ ప్రధానమంత్రికి లేఖ రాశారు. అయితే అనుకోకుండా తాను మోడీకి రాసిన లేఖలో విజయ్ తప్పు చిరునామాను ఇచ్చారట.
కాగా, సినిమా పరిశ్రమ అభివృద్ధి పైన సర్వీస్ ట్యాక్స్ ప్రభావం చాలా పడుతుందని, ఈ కారణంగా దానిని ఎత్తివేయాలని విజయ్ తాను రాసిన లేఖలో మోడీకి విజ్ఞప్తి చేశారు. సేవాపన్నును ఎత్తివేయాలని కోరుతూ మోడీకి విజయ్ లేఖ రాయడం పట్ల తమిళ సినీ వర్గాలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాయి.

పలు ఇబ్బందుల కారణంగా సినిమా నిర్మాతలు, పెట్టుబడిదారులు ఈ రంగానికి దూరంగా జరుగుతున్నారని, ఇది సినిమా పరిశ్రమలో పని చేస్తున్న వారికి ఎందరికో పని లేకుండా చేస్తుందని, ఈ కారణంగా సేవాపన్నును రద్దు చేస్తే కొంత ఊరట ఉంటుందని విజయ్ కోరారు.












Click it and Unblock the Notifications