విజయ్ ఊహించని నిర్ణయం, ఎగ్జిట్ పోల్స్ తో కొత్త రాజకీయం- ముందస్తు ఒప్పందం..!!

తమిళనాడులో అధికారం ఎవరిది. ఎగ్జిట్ పోల్స్ వెల్లడయ్యాయి. స్పష్టత వస్తుందని అందరూ భావించారు. ఈ ఎగ్జిట్ పోల్స్ మరింత సస్పెన్స్ పెంచాయి. విజయ్ ఫ్యాన్స్ లో జోష్ నింపాయి. డీఎంకే కు అనుకూలంగా మెజార్టీ సర్వే సంస్థలు అంచనాలు వెల్లడించినా... పోలింగ్ సరళి.. కొన్ని సర్వే సంస్థలు వెల్లడించిన లెక్కలతో విజయ్ కింగ్ అవుతారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. కాగా.. రాజకీయంగా ప్రత్యర్థులైన డీఎంకే - అన్నా డీఎంకే కూటములు సైతం అలర్ట్ అవుతున్నాయి. దీంతో.. విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు.

తమిళనాడు ఎగ్జిట్ పోల్స్ విజయ్ ఫ్యాన్స్ కు సంతోషాన్ని ఇచ్చాయి. విజయ్ మరో ఎంజీఆర్ కాబోతున్నారంటూ సోషల్ మీడియాలో పోస్టింగ్స్ కనిపిస్తున్నాయి. మెజారిటీ సర్వేలు అధికార డీఎంకే కూటమికే మరోసారి పట్టం కట్టినప్పటికీ, ఎన్డీటీవీ-యాక్సిస్ మై ఇండియా సర్వే మాత్రం ఊహించని విశ్లేషణను తెరపైకి తెచ్చింది. ప్రముఖ నటుడు విజయ్ స్థాపించిన 'తమిళ వెట్రి కళగం' (టీవీకే) తన తొలి ప్రయత్నంలోనే అధికార పక్షానికి ముచ్చెమటలు పోయిస్తూ కింగ్‌మేకర్‌గా లేదా ప్రధాన రాజకీయ శక్తిగా అవతరించబోతోందని ఈ సర్వే వెల్లడించింది. మొత్తం 234 స్థానాలకు గానూ టీవీకే ఏకంగా 98 నుంచి 120 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని, అదే సమయంలో డీఎంకే కూటమి 92-110 స్థానాలకే పరిమితం కావచ్చని అంచనా వేయడం రాజకీయ వర్గాల్లో పెను సంచలనంగా మారింది.

Vijay is poised to reshape the political landscape and make a bid for the top post

కాగా, ఎన్డీఏ కూటమిగా పోటీ చేసిన పార్టీలు 22-32 సీట్లతో మూడో స్థానానికి పడిపోవచ్చని పేర్కొనడం ద్వారా దశాబ్దాలుగా కొనసాగుతున్న ద్రవిడ పార్టీల ఆధిపత్యానికి బ్రేక్ పడే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో.. తమిళ రాజకీయ ముఖచిత్రం ఇప్పుడు విజయ్ పార్టీ చుట్టూ తిరుగు తోంది. అయితే.. డీఎంకే కనిష్ఠంగా 98 సీట్లు వచ్చినా ఏ పార్టీ కూడా సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి ఉండకపోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. విజయ్ కు 118 మేజిక్ ఫిగర్ కు సమీపంలో వస్తే.. డీఎంకే - అన్నా డీఎంకే రెండు కూటముల్లో ఎవరు మద్దతు ఇస్తారనేది మరో చర్చగా మారుతోంది.

డీఎంకే తాము ఎవరి మద్దతు తీసుకోము.. ఎవరికీ మద్దతు ఇవ్వబోమని తేల్చి చెబుతున్నట్లు తెలుస్తోంది. గతంలోనూ డీఎంకే ఇదే వైఖరిలో రాష్ట్రంలో రాజకీయం చేసింది. ఇక.. అన్నా డీఎంకే లక్ష్యం డీఎంకే అధికారంలోకి రాకుండా చేయటం. అవసరమైతే విజయ్ తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయటానికి సిద్దమనే సంకేతాలు ఇస్తోంది. దీంతో.. తన పార్టీ నుంచి పోటీ చేసిన అభ్యర్దులతో విజయ్ కీలక సమావేశం ఏర్పాటు చేసారు. ఎగ్జిట్ పోల్స్ లెక్కలు.. మద్దతు.. అవసరమైతే ఎవరితో జత కట్టాలనే అంశాల పైన చర్చించే అవకాశం కనిపిస్తోంది. ఈ సమావేశం తుది ఫలితాల వేళ ఆసక్తి కరంగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+