Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

విజయ్ 'జననాయగన్' మూవీకి పెద్ద షాక్.. హైకోర్టు కీలక తీర్పు

తమిళ స్టార్ హీరో విజయ్ చివరి చిత్రం జన నాయగన్ విడుదలకు అడ్డంకులు తప్పడం లేదు. ఈ చిత్రం రిలీజ్ మరింత ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజాగా ఈ చిత్రాన్ని సెన్సార్ రివ్యూ కమిటీకి పంపుతూ మద్రాస్ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఈ సినిమాకు 'U/A' సర్టిఫికేట్ మంజూరు చేయాలని గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసింది. ఈ సినిమాలో కొన్ని విదేశీ శక్తులు భారత్ లో మతపరమైన విధ్వంసాలను రెచ్చగొట్టే విధంగా సీన్లు ఉన్నాయని.. ఇలాంటి సన్నివేశాలు దేశంలోని మత సామరస్యానికి విఘాతం కలిగించే అవకాశం ఉందని కోర్టు అభిప్రాయపడింది. ఈ మేరకు చిత్రాన్ని సెన్సార్ రివ్యూ కమిటీకి రిఫర్ చేస్తూ తాజాగా తీర్పును వెల్లడించింది.

తమిళ స్టార్ హీరో, టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ నటించిన జన నాయగన్ మూవీ రిలీజ్ మరింత ఆలస్యం కానున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ మూవీకి సంబంధించి మద్రాస్ హైకోర్టు కీలక తీర్పును వెల్లడించింది. విజయ్ జన నాయగన్ సినిమాకు 'U/A' సర్టిఫికేట్ మంజూరు చేయాలని గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను తాజాగా మద్రాస్ హైకోర్టు రద్దు చేసింది. సినిమా సెన్సార్ విషయంలో బోర్డుకు మరింత సమయం ఇచ్చి ఉండాల్సిందని హైకోర్టు సూచించింది. సెంట్రల్ బోర్డు ఫిల్మ్ సర్టిఫికెట్(CBFC) నుంచి జన నాయగన్ మూవీకి సర్టిఫికెట్ వచ్చేంతవరకూ ఆగాల్సిందేనని మాద్రాస్ హైకోర్టు తేల్చి చెప్పింది. ఈ మేరకు ఈ చిత్రాన్ని రివ్యూ కమిటీకి సిఫార్సు చేస్తూ హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది.

సినిమాను తిరిగి రివ్యూ కమిటీకి పంపడంలో ఎలాంటి తప్పు లేదని హైకోర్టు డివిజినల్ బెంచ్ అభిప్రాయ పడింది. సినిమాలోని కొన్ని సన్నివేశాల్లో విదేశీ శక్తులు భారత్ లో మత పరమైన ఘర్షణలకు పాల్పడుతున్నాయని.. భారత్ లో మత సామరస్యానికి ఇలాంటి సన్నివేశాలు విఘాతం కలిగిస్తాయని హైకోర్టు డివిజినల్ బెంచ్ స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే జన నాయగన్ మూవీకి 'U/A' సర్టిఫికేట్ మంజూరు చేయాలని గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను తాజాగా మద్రాస్ హైకోర్టు తోసిపుచ్చింది.

vijay Madras High Court Reopens Jana Nayagan Censor Row Sends to Review Committee Indefinitely

అంతేకాక ఈ మూవీని ఆర్మీ అధికారుల సమక్షంలో చూసిన తర్వాతే సర్టిఫికెట్ ఇవ్వాలని మద్రాస్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ మూవీలో భారత సైన్యానికి సంబంధించిన అనేక సీన్లు ఉన్నాయని అయితే మొదట సినిమాను చూసిన కమిటీలో ఈ విషయాలపై అవగాహన ఉన్న నిపుణులు లేరని.. ఈ క్రమంలో ఈ సారి ఆర్మీ అధికారుల సమక్షంలో రివ్యూ కమిటీ సినిమాను వీక్షించి సర్టిఫికెట్ ఇవ్వాలని మద్రాస్ హైకోర్టులోని డివిజినల్ బెంచ్ స్పష్టం స్పష్టం చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో విజయ్ జన నాయగన్ మూవీ రిలీజ్ మరింత ఆలస్యం కానుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+