లండన్‌లో విజయ్ మాల్యా అరెస్ట్, వెంటనే నిమిషాల్లో బెయిల్: 6 నెలల క్రితం అరెస్టైనా..
మనీ లాండరింగ్ కేసులో లిక్కరి కింగ్ విజయ్ మాల్యా లండన్‌లో అరెస్టయ్యాడు. ఆయన అరెస్టును అధికారులు ధ్రవీకరించారు. భారత్‌లో బ్యాంకులకు వేల కోట్లు ఎగ్గొట్టి మాల్యా లండన్‌లో తలదాచుకుంటున్న విషయం తెలిసిందే.
లండన్: మనీ లాండరింగ్ కేసులో లిక్కరి కింగ్ విజయ్ మాల్యా లండన్‌లో అరెస్టయ్యాడు. ఆయన అరెస్టును అధికారులు ధ్రువీకరించారు. అయితే, ఆ వెంటనే బెయిల్ పైన విడుదలయ్యారు. భారత్‌లో బ్యాంకులకు వేల కోట్లు ఎగ్గొట్టి మాల్యా లండన్‌లో తలదాచుకుంటున్న విషయం తెలిసిందే.
ఐదారు నెలల్లో విజయ్ మాల్యా అరెస్ట్ కావడం ఇది రెండోసారి. గతంలోను ఆయనను అధికారులు అరెస్టు చేశారు. కానీ ఆ తర్వాత వెంటనే విడుదలయ్యారు. ఇప్పుడు మరోసారి అరెస్టయ్యారు. మళ్లీ వెంటనే విడుదలయ్యారు. ఇలా అరెస్టై వెంటనే విడుదల కావడం రెండోసారి.

మన దేశంలోని బ్యాంకులకు రూ.9వేల కోట్ల రుణాలు ఎగ్గొట్టిన విజయ్ మాల్యా.. మార్చి 2016లో లండన్‌కు పారిపోయారు. రుణాల ఎగవేత కేసులో విచారణ కోసం తమ ముందు హాజరుకావాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కోరినప్పటికీ మాల్యా నుంచి ఎలాంటి స్పందనా రాలేదు.












Click it and Unblock the Notifications