మాల్యాకు మరో దెబ్బ: జీఎమ్మార్ కేసులో దోషిగా తేల్చిన కోర్టు
హైదరాబాద్: పారిశ్రామికవేత్త, కింగ్‌ఫిషర్ అధినేత విజయ్‌మాల్యాకు మరో ఎదురుదెబ్బ తగలింది. మాల్యాపై నమోదైన చెల్లని చెక్కు కేసు రుజువైంది. దీంతో అతడ్ని హైదరాబాద్‌లోని హైకోర్టు కోర్టు దోషిగా తేల్చింది.
రూ.50 లక్షల చొప్పున ఇచ్చిన రెండు చెక్కులు చెల్లకపోవడంపై 'జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్' పెట్టిన కేసులో నేరం రుజువైనట్లు ప్రత్యేక మేజిస్ట్రేట్ కోర్టు ప్రకటించింది.
శిక్షను ఖరారుచేసే ముందు నిందితుడు తన అభ్యర్థనను చెప్పుకోవడానికి వీలుగా హాజరుపరచాలంటూ విజయ్‌మాల్యాకు కోర్టు నాన్‌బెయిలబుల్ వారెంట్‌ను జారీచేసింది. మే 5న కోర్టు ముందు విజయ్‌మాల్యాను హాజరుపరచాలనీ, అదేరోజు శిక్షను ఖరారు చేస్తామని మూడవ ప్రత్యేక మేజిస్ట్రేట్ ఎం కృష్ణారావు ఆదేశాలు జారీచేశారు.

హైదరాబాద్‌లోని జీఎంఆర్ విమానాశ్రయాన్ని వినియోగించుకున్నందుకుగాను కింగ్‌ఫిషర్ రూ.25 కోట్ల దాకా బకాయి పడిందని జీఎంఆర్ తరఫు న్యాయవాది జి అశోక్‌రెడ్డి న్యాయస్థానం దృష్టికి తెచ్చారు.
ఈ మొత్తానికి ఇచ్చిన చెక్కులు చెల్లకపోవడంతో మొదట్లో కేసు దాఖలు చేశామని, రాజీ మార్గంలో రూ.22 కోట్లు చెల్లించడానికి కింగ్‌ఫిషర్ అంగీకరించిందని తెలిపారు. దీంతో విజయ్‌మాల్యాపై పెట్టిన కేసులను అప్పట్లో ఉపసంహరించుకున్నట్లు తెలిపారు. కానీ, రూ.22 కోట్ల నిమిత్తం ఇచ్చిన దాదాపు 45 చెక్కులు బ్యాంకుల్లో చెల్లకుండా పోవడంతో మళ్లీ కేసులు దాఖలుచేసినట్లు వివరించారు.
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి












Click it and Unblock the Notifications