Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మాల్యానా..మజాకా! సిద్ధార్థ ఆత్మహత్యను కూడా తనకు అనుకూలంగా మార్చుకున్నాడుగా!

బెంగళూరు: బ్యాంకులకు 9,500 కోట్ల రూపాయల మేర ఎగనామం పెట్టి దేశం విడిచి పారిపోయిన ప్రముఖ వ్యాపారవేత్త, లిక్కర్ బరూన్ విజయ్ మాల్యా..తన తెలివి తేటలను మరోసారి ప్రదర్శించారు. కేఫ్ కాఫీ డే వ్యవస్థాపక అధినేత వీజీ సిద్ధార్థ ఆత్మహత్య ఉదంతాన్ని కూడా తనకు అనుకూలంగా మార్చుకున్నారు. ఈ ఉదంతం నుంచి సానుభూతిని పొందే ప్రయత్నం చేశారు. సిద్దార్థ ఆత్మహత్యను అడ్డుగా పెట్టుకుని బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల వైఖరిని తప్పుపడుతున్నారు.

ఎలాంటి వారినైనా, ఎంతటి వారినైనా ఆత్మహత్యకు ప్రేరేపించేలా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. వీజీ సిద్ధార్థ ఆత్మహత్య ఉదంతంపై విజయ్ మాల్యా స్పందించారు. దేశ ఆర్థిక విధానాలు, బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు, పన్నుల వసూళ్ల వ్యవహారంపై ఘాటు విమర్శలు చేశారు. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు.. ఎంతటి వారినైనా ఆత్మహత్య చేసుకునేలా ప్రోత్సహిస్తాయని సంచలనం వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.

 Vijay Mallya corners govt agencies, banks over VG Siddharthas letter

ప్రస్తుతం తన పరిస్థితి కూడా సిద్ధార్థలాగే తయారైందని అన్నారు. ఆయనతో తనకు పరోక్ష వ్యాపార లావాదేవీలు ఉన్నాయని చెప్పారు. వీజీ సిద్ధార్థ ఓ అరుదైన వ్యక్తిత్వం ఉన్న పారిశ్రామికవేత్తగా విజయ్ మాల్యా అభివర్ణించారు. అత్యంత ప్రతిభావంతుడని, తోటి పారిశ్రామికవేత్తలకు స్ఫూర్తి నింపేలా ప్రభావం చేయదగ్గ లక్షణాలు ఉన్న వ్యక్తి అని అన్నారు.

సిద్ధార్థ చివరి సారిగా రాసిన లేఖను తాను చూశానని, ఆయన రాసిన విషయాలు తనను బాధ పెట్టాయని మాల్యా చెప్పారు. బ్యాంకులు గానీ, ఇతర ఆర్థిక సంస్థలు గానీ ఎలాంటి వారినైనా ఆత్మహత్య చేసుకునేలా ఒత్తిడిని తీసుకు రాగలవనే విషయం సిద్ధార్థ ఉదంతంతో మరోసారి స్పష్టమైందని అన్నారు.

రుణాలను కట్టడానికి తాను సిద్ధంగా ఉన్నప్పటికీ..బ్యాంకులు తన విషయంలో మొండిగా ప్రవర్తిస్తున్నాయని ఆయన ఆరోపించారు. రుణ గ్రహీతలు తమ అప్పులను బ్యాంకులకు తిరిగి చెల్లించే పరిస్థితిని ఇతర దేశాల ప్రభుత్వాలు గానీ, బ్యాంకర్లు గానీ కల్పిస్తారని.. భారత్ పరిస్థితి దీనికి భిన్నంగా ఉందని అన్నారు. తన ఆస్తులను జప్తు చేయడానికి చూపుతున్న శ్రద్ధ.. తాను అప్పులను తిరిగి చెల్లించడానికి అనువైన పరిస్థితులను కల్పించడంపై ఎందుకు చూపట్లేదని మాల్యా ఆరోపించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+