లండన్‌లో దర్జాగా విజయ్ మాల్యా: బస ఇక్కడే (ఫోటోలు)
న్యూఢిల్లీ: బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని వాటిని తిరిగి చెల్లించకుండా దేశం విడిచిన ప్రముఖ పారిశ్రామిక వేత్త, లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా లండన్‌లోనే ఉన్నట్లు మీడియా వర్గాలు పేర్కొన్నాయి. లండన్ శివారు ప్రాంతంలోని బేకర్ స్ట్రీట్ ప్రాంతంలో ఆయనకు చెందిన 30 ఎకరాల్లో విస్తరించిన 'లేడీవాక్' అనే ఎస్టేట్‌లో ఆయన బస చేసినట్లు సెక్యూరిటీ సిబ్బంది లండన్ మీడియాకు తెలిపారు.
అయితే అసలు విషయం తెలిసిన తర్వాత మాల్యా గురించి తమకేమీ తెలియదని బుకాయించారని స్థానిక మీడియా పేర్కొంది. కింగ్ ఫిషర్ మాజీ అధినేత విజయ్ మాల్యాకు లండన్‌తో పాటు కాలిఫోర్నియాలో కూడా ఆస్తులు ఉన్నాయి. లండన్‌లోని తివిన్ విలేజిలోని క్వీన్ హో లేన్‌లో అతిపెద్ద కంట్రీ హోమ్‌ను కలిగి ఉన్నాడు.

లండన్‌లో దర్జాగా విజయ్ మాల్యా: బస ఇక్కడే
60 ఏళ్ల విజయ్ మాల్యా భారత్‌లోని వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు నుంచి సుమారు 9 వేల కోట్ల రుణాలు తీసుకున్నారు. అయితే వాటిని తిరిగి చెల్లించకపోవడంతో విజయ్ మాల్యాను విల్‌పుల్ డిఫాల్టర్‌గా బ్యాంకులు ప్రకటించాయి.

లండన్‌లో దర్జాగా విజయ్ మాల్యా: బస ఇక్కడే
విజయ్ మాల్యా ఉద్దేశపూర్వకంగానే రుణాలు ఎగవేసినట్లు బ్యాంకులు ఆరోపిస్తూ, పాస్‌పోర్టును స్వాధీనం చేసుకోవాలంటూ ఆయన దేశం విడిచి వెళ్లిపోకుండా నిరోధించాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేతృత్వంలోని 17 బ్యాంకుల కన్సార్టియం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు బుధవారం విచారణ జరిపింది.

లండన్‌లో దర్జాగా విజయ్ మాల్యా: బస ఇక్కడే
ఈ క్రమంలో మాల్యా ఈ నెల 2న దేశాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయారని అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గి సుప్రీంకోర్టుకు తెలిపారు. మాల్యా తీసుకున్న రుణాల కన్నా ఎక్కువ ఆస్తులే ఆయనకు విదేశాల్లో ఉన్నాయని ఆయన న్యాయస్థానానికి నివేదించారు. బ్యాంకుల విజ్ఞప్తి మేరకు రెండు వారాల్లోగా కోర్టు ఎదుట హాజరు కావాలంటూ విజయ్ మాల్యాకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.

లండన్‌లో దర్జాగా విజయ్ మాల్యా: బస ఇక్కడే
రాజ్యసభకు చెందిన అతని అధికారి ఈయిల్ ఐడీ, లండన్‌లోని భారత హైకమిషన్, అతని న్యాయవాదుల ద్వారా ఈ నోటీసుల పంపనున్నారు. ఈనేపథ్యంలో విజయ్ మాల్యా ఎక్కడకు వెళ్లారన్నదానిపై ఉత్కంఠ నెలకొనగా, ఆయన లండన్‌లోనే ఉన్నట్లు లండన్ మీడియా పేర్కొంది.












Click it and Unblock the Notifications