ఈడీ హెచ్చరికతో మాల్యా బెంబేలు: రూ.6వేల కోట్లకు సెటిల్మెంట్
బెంగళూరు: ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) హెచ్చరికల నేపథ్యంలో బ్యాంకులకు వేల కోట్ల రూపాయల రుణాలను ఎగవేసి విదేశాలకు చెక్కేసిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా... చివరకు దిగిరాక తప్ప లేదు. ఇప్పటికే మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు రావడంతో షాక్ తిన్న మాల్యా... బ్యాంకుల రుణాలను చెల్లించేందుకు సిద్ధంగానే ఉన్నానని ప్రకటించిన విషయం తెలిసిందే.
ఈ మేరకు తొలి విడతగా రూ.4 వేల కోట్లను చెల్లిస్తానని ఆయన సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే కోర్టు ఆయనకు మొట్టికాయలేసింది. ముందుగా మీ ఆస్తుల విలువెంతో చెప్పడంతో పాటు ఎప్పుడు వస్తారో చెప్పాలంటూ కోర్టు ఆయనకు షాకిచ్చింది.

కాగా, ఐడీబీఐ కేసులో తన ముందుకు విచారణకు హాజరుకాని మాల్యా పాస్ పోర్టు రద్దు చేయాలంటూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ప్రభుత్వానికి బుధవారం లేఖ రాసింది. ఈ విషయం తెలుసుకున్న మాల్యా వేగంగా స్పందించారు. తన పాస్ పోర్టు రద్దు అయితే మరింత విషమ పరిస్థితులను ఎదుర్కోక తప్పదన్న భావించిన మాల్యా... రుణాల సెటిల్‌మెంట్‌కు సంబంధించి మరో కొత్త ఆఫర్ ను తెరపైకి తెచ్చారు.
బ్యాంకుల వద్ద తీసుకున్న రూ.4,900 కోట్లు, దానికి అయిన వడ్డీ... మొత్తం కలుపుకుని రుణం రూ.9 వేల కోట్లకు చేరుకున్న సంగతి తెలిసిందే. ఈడీ షాక్‌తో బెంబేలెత్తిన మాల్యా... ఇంతకుముందు చేసిన రూ.4 వేల కోట్ల ఆఫర్‌ను తాజాగా మరో రూ.2 వేల కోట్లు పెంచుతూ.. మొత్తం సెటిల్‌మెంట్‌ను రూ.6 వేల కోట్లకు పెంచారు. ఈ మేరకు కొత్త ప్రతిపాదనను ఆయన త్వరలోనే కోర్టుకు ముందుకు తీసుకురానున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications