పింకీనే అన్నీ! మూడేళ్లు సహజీవనం, మూడో పెళ్లికి మాల్యా రెడీ
లండన్/ముంబై: 9వేల కోట్ల రూపాయల రుణాలను బ్యాంకులకు ఎగ్గొట్టి లండన్ పారిపోయిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా ముచ్చటగా మూడో పెళ్లికి సిద్ధమయ్యారు. పింకీ లాల్వానీ అనే మహిళతో గత కొంత కాలంగా మాల్యా డేటింగ్ చేస్తున్నట్లు సమాచారం.
2011లో పింకీకి.. మాల్యా తాను యజమానిగా వ్యవహరించిన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌లో ఉద్యోగం ఇప్పించారు. ఆమె హెయిర్ హోస్టెస్‌గా పని చేసిన కాలం నుంచి విజయ్ మాల్యాకు పరిచయం ఉంది.

మూడేళ్లుగా సహజీవనం
కాగా, ప్రస్తుతం లండన్‌లో తలదాచుకున్న మాల్యాకు తోడుగా పింకీనే అన్నీ దగ్గరుండి చూసుకుంటున్నారు. కోర్టు విచారణలకు కూడా ఇద్దరూ కలిసే వెళుతున్నారట. మూడేళ్లుగా సహజీవనం చేస్తున్న వీరిద్దరూ త్వరలో వివాహం చేసుకోబోతున్నట్లు తెలిసింది.

మాల్యాకిది మూడో వివాహం
అదే నిజమైతే మాల్యాకు ఇది మూడో వివాహం కానుంది. తొలుత మాల్యా ఎయిర్ ఇండియా మాజీ ఎయిర్ హోస్టెస్ సమీరా త్యాబ్జీని వివాహం చేసుకున్నారు. వీరిద్దరి కుమారుడే సిద్ధార్థ్ మాల్యా.

చిన్ననాటి స్నేహితురాలితో రెండో వివాహం
ఆ తర్వాత మాల్యా తన చిన్ననాటి స్నేహితురాలు రేఖను వివాహం చేసుకున్నారు. వీరిద్దరికీ ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇప్పుడు మాల్యా.. పింకీని లండన్‌లోనే వివాహం చేసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

భారత్ తీసుకురావడం కష్టమేనా?
మన దేశంలోని వివిధ బ్యాంకులకు రూ.9000 కోట్లు ఎగ్గొట్టిన మాల్యా లండన్‌కు పారిపోయిన విషయం తెలిసిందే. కొన్ని నెలల తర్వాత అక్కడి పోలీసులు మాల్యాను అదుపులోకి తీసుకుని వెస్ట్ మినిస్టర్ న్యాయస్థానానికి తరలించారు.
ఆ తర్వాత కొద్ది సేపటికే మాల్యా బెయిల్‌పై బయటకువచ్చారు. కాగా, మాల్యాను భారత్ తీసుకొచ్చేందుకు కేంద్రం, దర్యాప్తు సంస్థలు ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నాయి.
-
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
మ్యాచ్ గెలిచినా.. ఆనందం లేకపాయె -
దళపతితో చేతులు కలిపిన దీదీ, ఇండియా కూటమిలో ప్రకంపనలు -
జన్మ నక్షత్రం మృగశిర, ఆరుద్ర ఉన్నవారి మే నెల జాతక ఫలం -
ఎంత సీఎం అయినా.. !! -
DA సున్నా?: ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పీక్స్! శాలరీ హైక్ రిపోర్ట్ -
సీనియర్ ఎన్టీఆర్‌కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ వరం, ఇక కొత్త రూపు..!! -
Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ సంపాదన, ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!!












Click it and Unblock the Notifications