ఊబి నుంచి బయటపడటానికి విజయ్ విశ్వ ప్రయత్నాలు- వీడియో కాల్ లో
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన కరూర్ తొక్కిసలాట ఘటనలో భారీగా అరెస్టులు చోటు చేసుకుంటోన్నాయి. ఈ ఘటనకు సంబంధించి యూట్యూబర్ కమ్ జర్నలిస్ట్ ఫెలిక్స్ గెరాల్డ్‌ను చెన్నై సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై ఆయన చిత్రీకరించిన ప్రచురించిన వీడియోల నిమిత్తం విచారణ కోసం ఆయనను అదుపులోకి తీసుకున్నారు. తొక్కిసలాట ఘటనకు సంబంధించి నకిలీ వార్తలను ప్రచారం చేశారనే ఆరోపణలు ఆయనపై ఉన్నాయి.
అటు విజయ్ ఎన్నికల ప్రచార వాహనం డ్రైవర్‌పై కేసు నమోదైంది. మనుషుల ప్రాణాలకు ముప్పు వాటిల్లేలా వాహనం నడిపినందుకు కరూర్ వేలాయుధపాళ్యం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వాహనాన్ని సీజ్ చేశారు. ప్రమాదానికి కారణమైన విజయ్ ప్రచార వాహనాన్ని ఎందుకు స్వాధీనం చేసుకోకూడదని మద్రాస్ హైకోర్టు పోలీసు అధికారులను ప్రశ్నించిన మరుసటి రోజే ఈ ఘటన చోటు చేసుకుంది.

ఈ పరిణామాల నేపథ్యంలో ఈ వివాదాల నుంచి బయటపడటానికి విజయ్ విశ్వప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇందులో భాగంగా తొక్కిసలాటలో మరణించిన వారి కుటుంబాలవారితో వీడియో కాల్‌లో మాట్లాడారు. వారికి భరోసా ఇచ్చారు. అన్ని రకాలుగా ఆదుకుంటానని చెప్పారు. త్వరలో వ్యక్తిగతంగా వచ్చి కలుస్తానని అన్నారు. మరణించిన ప్రతి కుటుంబాన్నీ పలకరిస్తానని, ఓదార్చుతానని విజయ్ పేర్కొన్నారు.
ఎమ్నూర్ పుదూర్‌కు చెందిన బాధిత కుటుంబంతో విజయ్ వీడియో కాల్ లో మాట్లాడారు. వారిని పరామర్శించారు. పుదూర్ కు చెందిన చంద్ర కరూర్ తొక్కిసలాటలో మరణించారు. కుటుంబానికి చెందిన సెల్వరాజ్ తో అయిదు నిమిషాల పాటు వీడియో కాల్ లో మాట్లాడారు విజయ్. తొక్కిసలాట పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఎప్పటికీ జరగకూడని ఘటనగా అభివర్ణించారు. చంద్ర కుటుంబానికి పూడ్చలేని కష్టం కలిగిందని ఓదార్చారు.
ఈ ఘటనలో మరణించిన 41 మంది కుటుంబాలకు చెందిన ఆరుగురితో విజయ్ వీడియో కాల్ లో మాట్లాడినట్లు టీవీకే వెల్లడించింది. అందర్నీ పేరు పేరునా ఆయన సంతాపం తెలిపారని, త్వరలోనే నేరుగా వారి కుటుంబ సభ్యలను కలుసుకుంటారని తెలిపింది. దీనికి సంబంధించిన రూట్ మ్యాప్ సిద్ధం చేస్తోన్నామని వివరించింది. అలాగే- గాయపడ్డ వారిని కూడా పరామర్శించాలని విజయ్ భావిస్తోన్నట్లు టీవీకే పేర్కొంది.
-
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త!












Click it and Unblock the Notifications