ఓటమితో కార్యకర్త సూసైడ్: విజయకాంత్ మనోవేదన
చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయకాంత్ నేతృత్వంలోని డీఎండీకే, ఆయన కూటమి ఘోర పరాభవం పాలయింది. దీంతో, డీఎండీకే పార్టీకి చెందిన ఓ కార్యకర్త తీవ్ర మనోవేధనకు గురయ్యాడు. అతను ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
కడలూరు జిల్లా అన్నాగ్రామం సమీపంలోని కొంగరాయనూర్ ప్రాంతానికి చెందిన సుబ్రమణి డీఎండీకే ప్రాంతీయ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నాడు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో తమ పార్టీకి ఒక్క సీటు కూడా రాకపోవడంతో అతను ఆత్మహత్య చేసుకున్నాడు.
దీనిపై డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్ ఆవేదన వ్యక్తం చేశారు. సుబ్రమణి ఆత్మహత్య చేసుకున్న మాట విని తాను తీవ్ర మనోవేదనకు గురైనట్లు పేర్కొన్నారు. జీవితంలో పోరాడి గెలవాలన్న మనోధైర్యంతో కార్యకర్తలందరూ జీవించాలని, రాజకీయాల్లో గెలుపోటములు సహజమన్నారు.

ఓటమికి ఆత్మహత్య సమాధానం కాదన్నారు. ఈ సందర్భంగా మృతుడి కుటుంబానికి ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. తమిళనాడులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో డీఎండీకే ముఖ్యమంత్రి అభ్యర్థిగా.. లెఫ్ట్ తదితర పార్టీలతో కలిసి కూటమి ఏర్పడింది. కానీ ఈ కూటమి ఒక్క సీటు దక్కించుకోలేదు.
ఈ సంఘటపై డీఎండీకే అధినేత విజయ్ కాంత్ ఆవేదన వ్యక్తం చేశారు. సుబ్రమణి ఆత్మహత్య వార్త విని తాను చలించిపోయానని, మనో ధైర్యంతో కార్యకర్తలందరూ ఉండాలని ఆయన అన్నారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, జీవితంలో పోరాడి గెలవాలి తప్పా, ఓడిపోయామని చెప్పి ఆత్మహత్యకు పాల్పడటం సరికాదని డిపాజిట్ కూడా దక్కించుకోలేక పోయిన విజయ్ కాంత్ కార్యకర్తలకు సూచించారు.












Click it and Unblock the Notifications