విజయ్ కాంత్ పార్టీకి గట్టి దెబ్బ: రద్దు అయ్యే అవకాశం ?
న్యూఢిల్లీ/ చెన్నై: ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తూ వచ్చిన తమిళనాడు సినీ హీరో, డీఎండీకే అధినేత క్యాప్టెన్ విజయ్ కాంత్ కు గట్టి ఎదురు దెబ్బ తగలనుంది. ఆయన మునగడమే కాకుండ పార్టీ నాయకులు, కార్యకర్తలను నిలువునా ముంచేసిన క్యాప్టెన్ ఇప్పుడు డీఎండీకే పార్టీని ఎలా కాపాడుకోవాలి అని అయోమయంలో పడిపోయారు.
2016 శాసన సభ ఎన్నికల్లో విజయ్ కాంత్ పార్టీ ఘోర పరాజయం పొందిన విషయం తెలిసిందే. విజయ్ కాంత్ కు సైతం డిపాజిట్ రాలేదు. ఒక్క శాసన సభ నియోజక వర్గంలో ఆ పార్టీకి చెందిన వారు విజయం సాధించలేదు. విజయ్ కాంత్ కు చెందిన డీఎండీకే పార్టీ చిత్తుగా ఓడిపోయింది.

గత ప్రభుత్వంలో తమిళనాడు శాసన సభ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న విజయ్ కాంత్ ఆధ్వర్యంలోని డీఎండీకే పార్టీ ప్రస్తుతం జరిగిన శాసన సభ ఎన్నికల్లో కేవలం 2.4 శాతం ఓట్లు సంపాధిచింది. అది ప్రజా సంక్షేమ కూటమి (పీడబ్ల్యూపీ)తో జతకట్టి ఎన్నికల్లో పోటీ చేశారు.
ఒక ప్రాంతీయ పార్టీగా ఎన్నికల గుర్తింపు పొందాలంటే ఆరు శాతం కంటే ఎక్కువ ఓట్లు సంపాధించాలి. అయితే డీఎండీకేకి కేవలం 2.4 శాతం ఓట్లు రావడంతో తమిళనాడులో ఆపా ర్టీ గుర్తింపు రద్దు కానుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈ విషంపై క్యాప్టెన్ ఇంత వరకు ఏ విధంగా స్పందించలేదు.












Click it and Unblock the Notifications