సొంత పార్టీ ఎమ్మెల్యేను కొట్టిన హీరో విజయకాంత్
చెన్నై: తన ప్రసంగానికి అడ్డు తగిలాడన్న కోపంతో సొంత పార్టీకి చెందిన శాసన సభ్యుడి పైన ప్రముఖ నటుడు, తమిళనాట డీఎండీకే పార్టీ అధ్యక్షులు విజయకాంత్ చేయి చేసుకున్నారు. ఇది కొత్త విమర్శలకు దారి తీసింది. ఆయన సొంత పార్టీ ఎమ్మెల్యే పైనే చేయి చేసుకోవడం గమనార్హం.
కడలూరు జిల్లాలో భారీ వర్షాల కారణంగా నష్టపోయిన ప్రజలను పరామర్శించేందుకు విజయకాంత్ వెళ్లారు. బన్రూట్టి గ్రామంలో ఆయన ప్రసంగిస్తున్నారు. కొందరు స్థానిక నేతల పేర్లను ఆయన తప్పుగా పలికారు. పక్కనే ఉన్న ఎమ్మెల్యే శివకుళందై దానిని గమనించారు.

పేర్లను సరిచేసేందుకు ప్రయత్నించారు. దీంతో విజయకాంత్ ఒక్కసారిగా సహనం కోల్పోయారు. ఎమ్మెల్యే వీపుపై, ఆ తర్వాత తల పైన కొట్టారు. గతంలోను విజయకాంత్ ఇలా రెండుమూడుసార్లు చేయి చేసుకున్న సందర్భాలు ఉన్నాయి.












Click it and Unblock the Notifications