విజయ్ కాంత్‌కు గుండు సున్నా: భార్య ప్రేమలతే ముంచిందా?

చెన్నై: తమిళనాడు ఎన్నికల్లో విజయం సాధించేది తామేనని అతి విశ్వాసంతో ఉన్న డీఎండీకే అధినేత, హీరో విజయ్ కాంత్‌కు చావు దెబ్బ తగిలింది. గురువారం వెల్లడైన తమిళనాడు ఎన్నికల్లో కెప్టెన్ ఒక్కటంటే ఒక్కసీటు కూడా గెలుచుకోలేకపోతున్నాడు.

తాను పోటీ పడిన ఉళుందుర్ పెట్టాయ్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఘోరంగా ఓటమిపాలై, మూడవ స్థానంలో ఉన్నారు. ఎన్నికల ప్రచారంలో ఆయన చేసిన పరుష వ్యాఖ్యలు, దుందుడుకుతనాన్ని ఎన్నోమార్లు చూసిన ఓటర్లు విజయకాంత్‌ను దూరం పెట్టారనే వాదన వినిపిస్తోంది.

ఎన్నికల ప్రచారంలో సీఎం కుర్చీ తనదేనని ఆయన చెప్పిన మాటలు ఉత్తమ కుమారుడి ప్రగల్భాలేనని తేలిపోయింది. ఆ పార్టీ కనీసం ఖాతా కూడా తెరవలేని స్థితిలో ఉంది. ఆ పార్టీ తరుపును పోటీ చేసిన అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్ధులు మూడు, నాలుగు స్థానాలకు పడిపోయారు.

అసలు దీనికంతటికీ కారణం కెప్టెన్ స్వయం కృపరాధమా లేక ఆయన భార్య ప్రేమలత చేసిన వివాదాస్పద వ్యాఖ్యాలా? ఎన్నికలకు ముందు పొత్తుల విషయంలో కూడా కెప్టెన్ ఖరాఖండిగా వ్యవహరించారు. డీఎండీకే పొత్తు పెట్టుకుంటామని వచ్చిన బీజేపీని సైతం తొసిపుచ్చారు.

Vijayakanth zero in tamil nadu elections

ప్రచారంలో కూడా విజయ్ కాంత్ తన ప్రత్యర్ధులపై మాటల తూటాలను పేల్చారు. అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత, డీఎంకే అధ్యక్షుడు కరుణానిధిపై వ్యక్తిగత ఆరోపణలకు దిగారు. మంగళవారం తాంబరంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వారిద్దరిపై వ్యంగ్య, విమర్శనాస్త్రాలతో విరుచుకుపడ్డారు.

''ప్రజల సొమ్మును దోచుకునేందుకు ఇద్దరు దోపిడీ దొంగలు వస్తున్నారు జాగ్రత్త'' అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించిన విజయకాంత్... ఆ తర్వాత సరికొత్తగా కరుణ, జయలపై ఘాటు వ్యాఖ్యలు సంధించారు. అవినీతిలో కరుణ, జయలిద్దరూ సమఉజ్జీలేనని ఆయన ఆరోపించారు.

తన దృష్టిలో కరుణానిధి చీర కట్టిన జయ లాంటివారని, అన్నాడీఎంకే నాయకురాలు ధోవతి కట్టిన కరుణానిధి వంటివారని విమర్శించారు. 'ఐదు దశాబ్దాలుగా రాష్ట్రాన్ని అధోగతి పాల్జేసిన అన్నాడీఎంకే, డీఎంకే పార్టీలంటే ఏమిటో తెలుసా? డీఎంకే అంటే తిల్లుముల్లు మున్నేట్ర కళగం (మోసపూరిత డీఎంకే) అనీ, అన్నాడీఎంకే అంటే 'అనైత్తిలుం తిరుట్టు మున్నేట్ర కళగం (అన్నింటా దోపీడీలకు పాల్పడే పార్టీ) అని అర్థం' అని చెణుకులు విసిరారు.

ఇలా ప్రత్యర్ధి పార్టీ నేతలపై వ్యక్తిగత ఆరోపణలతో పాటు ఆయన పరుష వ్యాఖ్యలు, దుందుడుకుతనాన్ని ఎన్నోమార్లు చూసిన ఓటర్లు విజయకాంత్ ను దూరం పెట్టాలనే నిర్ణయించినట్టు ఎన్నికల ఫలితాల అనంతరం తెలిపోయింది. దీనికి తోడు తమిళనాడులోని చిన్న చిన్న పార్టీలతో కలిసి ఒక కూటమిగా ఏర్పడిన సంగతి తెలిసిందే.

డీఎండీకే కూటమిలోని పార్టీలకు సరైన ప్రాధాన్యత ఇవ్వకుండా సీట్ల విషయంలో కూడా అన్యాయం చేశారనే వార్తలు అప్పట్లో వినిపించాయి. దీంతో పాటు డీఎండీకే కూటమికి తానే సీఎం అభ్యర్ధినని ప్రకటించుకున్నారు. మరోవైపు విజయ్ కాంత్‌కు ఒక్క సీటు కూడా రాకపోవడానికి కారణం ఆయన భార్య కారణమనే వారు కూడా లేకపోలేదు.

డీఎండీకే కూటమిని అధికారంలోకి తీసుకురావడం కోసం డీఎండీకే పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు, విజయ్ కాంత్ సతీమణి ప్రేమలత డీఎంకే, అన్నాడీఎంకేపై మండిపడ్డారు. తిరునల్వేలిలో జరిగిన ఎన్నికల బహిరంగ సభలో ప్రేమలత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అన్నాడీఎంకే, డీఎంకే పార్టీలు ఓట్ల కోసం డబ్బులు ఇస్తే తీసుకోవాలని ఓటర్లుకు సూచించారు.

'కొన్ని పార్టీలు ఓటుకు రెండు నుంచి మూడు వేల రూపాయల వరకు ఇస్తాయి. మీరు ఓటుకు లక్ష రూపాయులు అడగండి' అని ప్రేమలత ప్రజలనుద్దేశించి వ్యాఖ్యానించారు. ప్రేమలత చేసిన వ్యాఖ్యలపై అన్నాడీఎంకే కార్యకర్తలు ఫిర్యాదు చేయగా, ఆమె మాట్లాడిన వీడియో రికార్డింగ్‌లను పరిశీలీంచిన పోలీసులు ఆమెపై కేసు కూడా నమోదు చేసిన సంగతి తెలిసిందే.

ఇలా కర్ణుడి చావుకి వంద కారణాలు మాదిరిగా తమిళనాడు ఎన్నికల్లో కెప్టెన్ విజయ్ కాంత్ ఓటమికి ప్రత్యర్ధి పార్టీ నేతలపై ఆయన చేసిన వ్యక్తిగత విమర్శలతో పాటు, ఆయన భార్య ప్రేమలత చేసిన వివాదాస్పద వ్యాఖ్యలే కారణమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+