రజనీకాంత్‌పై నోరు పారేసుకున్న విజయ్‌కాంత్
చెన్నై: డిఎండికె అధినేత, తమిళ నటుడు విజయ్ కాంత్ మరోసారి నోరు పారేసుకున్నాడు. అనుచిత వ్యాఖ్యలు చేయడంలో సిద్ధహస్తుడైన ఆయన ఈసారి తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. రజనీకాంత్ మాదిరిగా తాను పిరికివాడిని కాదని ఆయన అన్నారు.
రాజకీయ నాయకులు భయపెడితే భయపడడానికి తాను రజనీకాంత్ మాదిరిగా తాను పిరికివాడిని కాదని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలు వివాదాన్ని సృష్టించాయి. విజయ్ కాంత్ వ్యాఖ్యలపై రజనీకాంత్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

తమిళనాడులో పలు ప్రాంతాల్లో రజనీకాంత్ అభిమానులు విజయ్ కాంత్ దిష్టిబొమ్మలను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. విజయ్ కాంత్ గతంలో కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితతో ఎన్నికల పొత్తు గురించి అడిగిన మీడియా ప్రతినిధులపై తిట్లదండకం ఎత్తుకున్నారు.
అప్పట్లో మీడియా ప్రతినిధులు నిరసన వ్యక్తం చేశారు. సొంత పార్టీ నాయకులపై కూడా ఆయన అనుచితంగా ప్రవర్తించిన సందర్భాలున్నాయి.












Click it and Unblock the Notifications