వికాస్ దూబే భార్య, కుమారుడు, పనివాడు అరెస్ట్, బిక్రూ ఘటనలో రిచా కీ రోల్..

గ్యాంగ్ స్టార్ వికాస్ దూబే అరెస్టయ్యాక అతని అనుచరులపై పోలీసులు ఫోకస్ చేశారు. దూబే భార్య రిచా దూబే, కుమారుడు, వారి సేవకుడిని లక్నో పోలీసులు అరెస్ట్ చేశారు. దూబేను మధ్యప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత కొన్ని గంటల్లో.. వీరిని లక్నో స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దూబే చేసిన చట్టవిరుద్ధ కార్యకలాపాలకు రిచా కూడా సహకరించారని పోలీసులు భావిస్తున్నారు.

 Vikas Dubeys wife, son, servant arrested by Lucknow Police..

Recommended Video

    Vikas Dubey ఎన్కౌంటర్ , పారిపోతుండగా కాల్చి చంపిన పోలీసులు!! || Oneindia Telugu

    గురువారం కృష్ణనగర్‌లో గల ఇంట్లో రిచా, ఆమె కుమారుడు, పనివాడిని అరెస్ట్ చేశారు. కాన్పూర్ బిక్రూలో ఈ నెల 3వ తేదీన 8 మంది పోలీసుల మృతి కుట్రలో రిచా పాత్ర ఉంది అని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. అంతేకాదు తన మొబైల్ ఫోన్‌కు ఇప్పుడు కూల్చివేసిన ఇంటితో సీసీటీవీ కెమెరా కనెక్ట్ అయ్యిందని తెలిపారు. కాన్పూర్ కాల్పుల తర్వాత అక్కడినుంచి రిచా పారిపోయారని పోలీసులు తెలిపారు.

    రిచాను భర్త వికాస్ దూబే వద్దకు లక్నో పోలీసులు తీసుకెళ్లారు. అయితే ఇదివరకు కూడా కృష్ణనగర్ నివాసానికి పోలీసులు రెండుసార్లు వెళ్లారు. కానీ ఆ సమయంలో రిచా, ఆమె కుమారుడు పోలీసులకు కనిపించకపోవడం విశేషం. గ్యాంగ్ స్టార్ వికాస్ దూబేను మధ్యప్రదేశ్ పోలీసులు గురువారం మహకాళీ ఆలయం వద్ద అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. 8 మంది పోలీసుల కాల్పుల ఘటనలో కీలక పాత్ర పోషించారని భావిస్తున్నారు. దూబేను మధ్యప్రదేశ్ పోలీసులు యూపీ పోలీసులకు అప్పగించారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+