హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Villain: చిరంజీవి, రజనీకాంత్ విలన్ ఇంటికి సీల్ వేసిన అధికారులు, నిజజీవితంలో కబ్జాలు చేసి !

|
Google Oneindia TeluguNews

చెన్నై: బహుబాష నటుడిగా, విలన్ గా, కామిడీ యాక్టర్ గా అందరికి పరిచయం అయిన మన్సూర్ ఆలీ ఖాన్ కు సినిమా కనపడింది. సూపర్ స్టార్ రజనీకాంత్, క్యాప్టెన్ విజయ్ కాంత్, మెగాస్టార్ చిరంజీవి ఇలా టాప్ హీరోల అందరితో నటించిన మన్సూర్ ఆలీ ఖాన్ నిత్యం వివాదాలు నెత్తిన మూటకట్టుకుని తిరుగుతుంటాడు. సౌత్ ఇండియా గబ్బర్ సింగ్ గా మన్సూర్ ఆలీ ఖాన్ కు మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. సినిమా రంగంలో, రాజకీయాల్లో కొనసాగుతున్న మన్సూర్ ఆలీ ఖాన్ కు వివాదాలు కొత్తకాదు. ఇప్పుడు చెన్నై సిటీలో మన్సూర్ ఆలీ ఖాన్ ఇంటికి కార్పోరేషన్ అధికారులు సీల్ వెయ్యడం కలకలం రేపింది. రాజకీయాల్లో తన సత్తా చాటుకుని పేద ప్రజలను ఉద్దరిస్తానని ఫోజులు కొడుతున్న మన్సూర్ ఆలీ ఖాన్ ఏం చేశారు అనే విషయాన్ని కార్పోరేషన్ అధికారులు స్టోరీ మొత్తం చెప్పారు.

EX lover: ఎంజాయ్ చేసిన ప్రియుడు సీక్రేట్ పెళ్లి, ప్రియురాలి దెబ్బతో మాజీ లవర్ భార్య ?, పగ, ప్రతీకారం !EX lover: ఎంజాయ్ చేసిన ప్రియుడు సీక్రేట్ పెళ్లి, ప్రియురాలి దెబ్బతో మాజీ లవర్ భార్య ?, పగ, ప్రతీకారం !

సినిమా నటుడిగా ఫేమస్ అయిన మన్సూర్ ఆలీ ఖాన్

సినిమా నటుడిగా ఫేమస్ అయిన మన్సూర్ ఆలీ ఖాన్

ఆర్ కే. సెల్వమణి (వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే రోజా భర్త) దర్శకత్వంలో తెరకెక్కిన క్యాప్టెన్ ప్రభాకర్ సినిమాతో మన్సూర్ ఆలీ ఖాన్ కు మంచి గుర్తింపు వచ్చింది. క్యాప్టెన్ ప్రభాకర్ సినిమాలో హీరో విజయ్ కాంత్ కు ఎంత పేరు వచ్చిందో అంతకంటే ఎక్కువ పేరు నటుడిగా మన్సూర్ ఆలీ ఖాన్ కు మంచి గుర్తింపు వచ్చింది.

రజనీకాంత్, చిరంజీవిలతో నటించాడు

రజనీకాంత్, చిరంజీవిలతో నటించాడు

సూపర్ స్టార్ రజనీకాంత్, క్యాప్టెన్ విజయ్ కాంత్, మెగాస్టార్ చిరంజీవి ఇలా టాప్ హీరోల అందరితో మన్సూర్ ఆలీ ఖాన్ నటించాడు. సుమారు 250కు పైగా సినిమాల్లో నటించిన మన్సూర్ ఆలీ ఖాన్ విలన్ గా, కామెడీ నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు, నటుడిగానే కాకుండా దర్శకుడి అవతారం ఎత్తిన మన్సూర్ ఆలీ ఖాన్ ఆ రకంగా గుర్తింపు తెచ్చుకున్నాడు.

రాజకీయాల్లో రాద్దాంతం చేసిన ఆలీ

రాజకీయాల్లో రాద్దాంతం చేసిన ఆలీ

సినిమాల్లో నటిస్తున్న మన్సూర్ ఆలీ ఖాన్ నిత్యం వివాదాలు నెత్తిన మూటకట్టుకుని తిరుగుతుంటాడు. సౌత్ ఇండియా గబ్బర్ సింగ్ గా మన్సూర్ ఆలీ ఖాన్ కు మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. సినిమా రంగంలో గుర్తింపు తెచ్చుకున్న మన్సూర్ ఆలీ ఖాన్ తరువాత రాజకీయాల్లోకి వచ్చాడు. రాజకీయాల్లో కొనసాగుతున్న మన్సూర్ ఆలీ ఖాన్ కు వివాదాలు కొత్తకాదు.

 ఎంపీగా ఓడిపోయాడు.... ఎమ్మెల్యేగా టిక్కెట్ రాలేదు

ఎంపీగా ఓడిపోయాడు.... ఎమ్మెల్యేగా టిక్కెట్ రాలేదు

దర్శకుడు, నామ్ తమిళ కచ్చి పార్టీ వ్యవస్థాపకుడు సీమాన్ తో సన్నిహితంగా ఉంటున్న మన్సూర్ ఆలీ ఖాన్ తరువాత ఆ పార్టీలో చేరి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో దిండుగల్ లోక్ సభ నియోజక వర్గం నుంచి పోటీ చేసిన మన్సూర్ ఆలీ ఖాన్ చిత్తుచిత్తుగా ఓడిపోయాడు. 2021 తమిళనాడు శాసన సభ ఎన్నికల్లో మన్సూర్ ఆలీ ఖాన్ కు టిక్కెట్ ఇవ్వడానికి సిమాన్ నిరాకరించడంతో ఆ పార్టీ నుంచి మన్సూర్ ఆలీ ఖాన్ బయటకు వచ్చేశాడు. సొంతంగా కొత్త పార్టీ పెట్టిన మన్సూర్ ఆలీ ఖాన్ తొండముత్తూరు నియోజక వర్గంలో అన్నాడీఎంకే పార్టీ మాజీ మంత్రి వేలుమణి మీద పోటీ చేసి డిపాజిట్ కూడా దక్కించుకోలేక చిత్తుచిత్తుగా ఓడిపోయాడు.

 వివేక్ మరణం, కరోనా వ్యాక్సిన్ మీద వివాదాస్పద వ్యాఖ్యలు

వివేక్ మరణం, కరోనా వ్యాక్సిన్ మీద వివాదాస్పద వ్యాఖ్యలు

ప్రముఖ తమిళ నటుడు వివేక్ మరణించిన సమయంలో మన్సూర్ ఆలీ ఖాన్ విదాదాస్ప వ్యాఖ్యలు చేశాడు. కోవిడ్ వ్యాక్సిన్ మీద ఇష్టం వచ్చినట్లు మాట్లాడిన మన్సూర్ ఆలీ ఖాన్ మీద పోలీసులు కేసు నమోదు చేశారు. కోర్టులో ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించిన మన్సూర్ ఆలీ ఖాన్ కు కోర్టు షరతులతో బెయిల్ మంజూరు చేసింది. ఇంకో సారి కోవిడ్ టీకా గురించి మాట్లాడకూడదని చెప్పిన కోర్టు మన్సూర్ ఆలీ ఖాన్ కు రూ. 2 లక్షలు జరిమానా విధించింది.

సార్ ఏం చేశాడంటే ?

సార్ ఏం చేశాడంటే ?

చెన్నైలోని వివిద ఏరియాల్లో మన్సూర్ ఆలీ ఖాన్ కు చాలా ఇండ్లు ఉన్నాయి. చెన్నైలోని చూలైమేడులోని పెరియార్ రోడ్డు పశ్చిమ విభాగంలో మన్సూర్ ఆలీ ఖాన్ కు ఓ ఇల్లు ఉంది. ఇంటి పక్కన బహిర్భూమికి కోసం 2,500 చదరపు అడుగుల స్థలాన్ని ఖాళీగా పెట్టిన ప్రభుత్వ భూమిని మన్సూర్ ఆలీ ఖాన్ అక్రమించుకుని ఇంటిని నిర్మించుకున్నాడు. ఈ విషయం గుర్తించిన కార్పోరేషన్ అధికారులు కోర్టును ఆశ్రయించారు.

మన్సూర్ ఆలీ ఖాన్ ఇంటికి సీల్ వేసిన అధికారులు

మన్సూర్ ఆలీ ఖాన్ ఇంటికి సీల్ వేసిన అధికారులు

కోర్టు ఆదేశాలతో ఇప్పుడు మన్సూర్ ఆలీ ఖాన్ ఇంటికి శనివారం చెన్నై కార్పోరేషన్ అధికారులు సీల్ వేశారు. చెన్నై సిటీలో మన్సూర్ ఆలీ ఖాన్ ఇంటికి కార్పోరేషన్ అధికారులు సీల్ వెయ్యడం కలకలం రేపింది. రాజకీయాల్లో తన సత్తా చాటుకుని పేద ప్రజలను ఉద్దరిస్తానని ఫోజులు కొడుతున్న మన్సూర్ ఆలీ ఖాన్ ఏం చేశారు అనే విషయాన్ని కార్పోరేషన్ అధికారులు స్టోరీ మొత్తం చెప్పారు. గతంలో కూడా మన్సూర్ ఆలీ ఖాన్ లేనిపోని విషయాల్లో జోక్యం చేసుకుని చాలా మంది దగ్గర చివాట్లు తిన్నాడు. ఏదోఒక విషయంలో మీడియా ముందు వచ్చి ఫ్రీ పబ్లిసిటీ సంపాధించుకోవాలని ప్రయత్నించిన మన్సూర్ ఆలీ ఖాన్ కు ఇప్పుడు చెన్నై కార్పోరేషన్ అధికారులు తగిన బుద్ది చెపపారని స్థానికులు అంటున్నారు.

English summary
Villain: Chennai corporation officials sealed Actor Mansoor Ali Khan's house in Choolaimedu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X