వినేశ్ సంచలనం - మీకల, నా ధైర్యం ఓడిపోయాయి.. ఇక గుడ్‌బై..!!
భారత స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగట్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన రెజ్లింగ్ కు గుడ్ బై చెబుతూ సంచలన ప్రకటన చేశారు. కుస్తీ నాపైన గెలిచిందని... అందుకే తాను ఓడిపోయానని ప్రకటించారు. తనను క్షమించాలంటూ ఆవేదన వ్యక్తం చేశారు దినేష్ ఫోగట్. మీ కల అలాగే నా ధైర్యం విచ్ఛిన్నం అయిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. వినేశ్ ట్వీట్ ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. పలువురు వినేశ్ నిర్ణయం పైన తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
రెజ్టింగ్ కు గుడ్ బై
భారత రెజ్లర్ వినేష్ ఫోగాట్ రెజ్లింగ్ కు వీడ్కోలు పలికింది. దీనికి సంబంధించి సోషల్‌మీడియాలో ఓ పోస్ట్‌పెట్టింది. సోషల్ మీడియా పోస్ట్‌లో, "అమ్మా, నా నుండి రెజ్లింగ్ గెలిచింది, నేను ఓడిపోయాను, క్షమించండి, మీ కల, నా ధైర్యం, ప్రతిదీ విచ్ఛిన్నమైంది, ఇప్పుడు నాకు ఇంతకంటే బలం లేదు. కుస్తీకి గుడ్‌బై 2001-2024. అమ్మా నన్ను క్షమించు అంటూ క్షమాపణలు చెప్పింది. మీరంతా ఎప్పుడూ నా వెంటే ఉంటారని ఆశిస్తున్నానను అంటూ రాసుకొచ్చింది. ప్యారీస్ ఒలంపిక్స్‌లో కేవలం 100 గ్రాముల అదనపు బరువు వల్ల రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌పై అనర్హత వేటు పడటం పెద్ద ఎత్తున చర్చకు కారణమైంది.

వినీశ్ నిర్ణయంతో
వినేశ్ కు ధైర్యం చెబుతూ ఎందరో ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. తన అనర్హతను సవాల్ చేస్తూ వినేష్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్ లో నిరసన వ్యక్తం చేసింది.అయితే తనతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో రెజ్లింగే గెలిచిందని, తన ధైర్యాన్ని దెబ్బతీసి, ఓడించిందని వినేష్ సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. వినేష్ ఫోగాట్ తన పోటీదారుతో జరిగిన సెమీ-ఫైనల్ మ్యాచ్‌లో 5-0 తేడాతో గెలిచింది. అంతేకాకుండా ఒలింపిక్ ఫైనల్‌కు అర్హత సాధించిన మొదటి భారతీయ మహిళా రెజ్లర్ గా రికార్డులు సృష్టించింది.
माँ कुश्ती मेरे से जीत गई मैं हार गई माफ़ करना आपका सपना मेरी हिम्मत सब टूट चुके इससे ज़्यादा ताक़त नहीं रही अब।
— Vinesh Phogat (@Phogat_Vinesh) August 7, 2024
अलविदा कुश्ती 2001-2024 🙏
आप सबकी हमेशा ऋणी रहूँगी माफी 🙏🙏
షాక్ లో అభిమానులు
2001లో రెజ్లర్‌గా అరంగేట్రం చేసిన వినేశ్ 29 యేళ్ల వయసులో రిటైర్‌మెంట్ ప్రకటించడం ఎవరూ జీర్ణించుకోలేక పోతున్నారు. ఒలంపిక్స్ నుంచి ఆమె వెనుదిరిగిన తర్వాత ఆమెకు ధైర్యం చెబుతూ ప్రధాని నరేంద్రమోదీతో సహా ఎందరో ప్రముఖులు ఎన్నో పోస్టులు పెట్టారు. ఒలింపిక్స్‌లో రెజ్లింగ్ గోల్డ్ మెడల్ సాధించేందుకు 2028 LA గేమ్స్‌పై దృష్టి పెట్టాలని కోరారు. అయినప్పటికీ వినేష్ మనోధైర్యం కోల్పోయారు. చివరి యుద్ధంలో ఓడిపోయానని, ఇకపై కొనసాగించడానికి ఏమీ మిగల్లేదని ఉద్వేగానికి గురయ్యారు. వినీశ్ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications