Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Vinesh Phogat: వినేష్‌కు రాజ్యసభ ఛాన్స్ మిస్ - తెర వెనుక..!!

వినేష్ ఫోగట్... గత వారం రోజుల వరకు కూడా ట్రెండింగ్‌లో ఉన్న పేరు. పారిస్ ఒలింపిక్స్‌లో మహిళా రెజ్లింగ్ విభాగంలో పోల్గొని ఫైనల్‌కు చేరి పతకం ఖాయం అనుకున్న సమయంలో పిడుగు లాంటి వార్త పతకం సాధించాలన్న ఆమె కలను చెరిపివేసింది. కేవలం 100 గ్రాములు బరువు ఎక్కువగా ఉన్నందువల్ల ఆమెను ఫైనల్స్‌కు అనర్హురాలిగా నిబంధనల మేరకు ప్రకటించారు.

దీనిపై న్యాయపోరాటం చేసినప్పటికీ ఫలితం దక్కలేదు. ఇక వినేష్ ఫోగట్ రెజ్లింగ్‌కు గుడ్ బై చెప్పేసింది. అయినప్పటికీ ఆమె కొన్ని కోట్ల మంది భారతీయుల మనసును గెలిచింది. ప్రస్తుతం వినేష్ ఫోగట్ పేరు మరోసారి హెడ్‌లైన్స్‌లో నిలుస్తోంది. మరోసారి వినేష్ ఫోగట్ వార్తల్లో ఎందుకు నిలుస్తోందో ఈ స్టోరీ చదివితే తెలుస్తుంది.

Vinesh Phogats Potential Rajya Sabha Entry What the rules Say

రాజ్యసభకు వినేష్ ఫోగట్..?

వినేష్ ఫోగట్ గతేడాది మొత్తం రోడ్డుపైనే ఉంటూ నిరసన తెలిపింది. మహిళా రెజర్లపై లైంగిక వేధింపులు ఎక్కువయ్యాయని అప్పటి రెజ్లింగ్ అధ్యక్షుడిగా ఉన్న మాజీ ఎంపీ బ్రిజ్ భూషణ్‌ను తొలగించాలంటూ డిమాండ్ చేస్తూ నిరసన తెలిపింది. ఆమె నిరసనకు యావత్ క్రీడాలోకం మద్దతు తెలిపింది. అండగా నిలిచింది. ఇక పోతే ఒలింపిక్స్‌లో డిస్‌క్వాలిఫై అయిన వినేష్ ఫోగట్ పై సానుభూతి నానాటికీ పెరిగిపోయింది. తాజాగా ఆమెను రాజ్యసభకు పంపాలన్న డిమాండ్ పెరుగుతోంది. వాస్తవానికి రాజ్యసభకు నామినేట్ అవుతున్న క్రీడాకారుల్లో ఎక్కువగా క్రికెట్ క్రీడాకారులు మాత్రమే కనిపిస్తున్నారు. ఇతర క్రీడలకు సంబంధించిన వారు చాలా అరుదుగా కనిపిస్తారు. ఉదాహరణకు అథ్లెట్‌గా ఉన్న పీటీ ఉషాను నామినేట్ చేశారు.

పెద్దల సభకు నో ఛాన్స్

ప్రస్తుతం దేశవ్యాప్తంగా 12 రాజ్యసభ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. సెప్టెంబర్ 3వ తేదీనాటికి వీటిని భర్తీ చేయాల్సి ఉంటుంది. అయితే నామినేషన్ దాఖలు చేసేందుకు చివరి తేదీ ఆగష్టు 21. రాజ్యసభ ఎన్నికల్లో పోటీచేసేందుకు అభ్యర్థులకు ఉండాల్సిన వయసు 30 ఏళ్లు. అయితే ప్రస్తుతం వినేష్ ఫోగట్ వయసు 29 ఏళ్లు, ఈ నెల 30వ తేదీన ఆమెకు 30 ఏళ్లు వస్తాయి. కానీ నామినేషన్ దాఖలు చేసేందుకు ఆగష్టు 21వ తేదీ చివరిది కావడంతో వినేష్ ఫోగట్ రాజ్యసభకు వెళ్లే ఛాన్స్ లేనట్టే. హర్యానా నుంచి కూడా రాజ్యసభ సీటు ఖాళీగా ఉంది. హర్యానా మాజీ సీఎం భూపిందర్ సింగ్ హూడా కుమారుడు దీపేందర్ హూడా మొన్న జరిగిన లోక్‌సభకు ఎన్నిక కావడంతో అతని సీటు ఖాళీ అయ్యింది. మొదటి నుంచి వినేష్ ఫోగట్‌ను రాజ్యసభకు నామినేట్ చేయాలంటూ నినదించిన వారిలో హుడా కుటుంబం ఒకటి.

Vinesh Phogats Potential Rajya Sabha Entry What the rules Say

రాజ్యసభలో క్రీడాకారులు వీరే

ప్రస్తుతం రాజ్యసభలో ఆమ్‌ఆద్మీ పార్టీ నుంచి ప్రాతినిథ్యం వహిస్తోన్న 35 ఏళ్ల రాఘవ్ చద్దా అత్యంత పిన్న వయస్కుడిగా ఉన్నారు.2022 మే 2న రాజ్యసభ సభ్యుడిగా ప్రమాన స్వీకారం చేసిన సమయంలో ఆయన వయస్సు 33 ఏళ్లు. రాజ్యసభలో రాజకీయ నాయకులు కాకుండా క్రీడాకారులు కూడా సభ్యులుగా ఉన్నారు. కొందరు ఆయా పార్టీల నుంచి నామినేట్ అవ్వగా మరికొందరు రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు నామినేట్ అయ్యారు. మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్, బాక్సింగ్‌లో వరల్డ్ ఛాంపియన్ మేరీ కోమ్‌ లాంటి వారు రాష్ట్రపతి కోటాలో నామినేట్ అవ్వగా.. మాజీ క్రికెటర్ స్పిన్ మాంత్రికుడు హర్భజన్ సింగ్‌ను ఆమ్ ఆద్మీ పార్టీ తమ పార్టీ నుంచి పెద్దలసభకు పంపింది.

మొత్తానికి హర్యానా ఎన్నికల వేళ వినేష్ ఫోగట్‌ను పెద్దల సభకు పంపాలనే అనుకూల నిర్ణయం తీసుకుంటారనే చర్చ జరుగుతున్న సమయంలో ఆమెకు 30 ఏళ్ల వయసు నిండకపోవడంతో అసెంబ్లీ బరిలో నిలుపుతారా అనే కొత్త చర్చ ప్రారంభమైంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+