దారుణం: భర్త డ్యూటీకి వెళ్ళగానే స్నేహితుడి భార్యపై రేప్
చెన్నై: భర్త ఇంట్లో లేని సమయంలో ఓ వివాహితపై వినోద్ అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డారు. పిల్లలను హతమారుస్తామని చెప్పి దుండగుడు బాధితురాలిపై అత్యాచారానికి దిగారు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైలో చోటు చేసుకొంది. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైలో గల టీ నగర్ సౌత్‌బోగ్ రోడ్డు అపార్ట్‌మెంట్‌లో ఓ వ్యక్తి వాచ్‌మెన్ గా పనిచేస్తున్నాడు. అతడికి భార్య, పిల్లలున్నారు. ఇతడు నేపాల్ దేశానికి చెందినవాడు. ఉదయం పూట ఈ అపార్ట్‌మెంట్ లో పనిచేస్తాడు. రాత్రిపూట అపార్ట్ మెంట్‌కు సమీపంలోని ఓ ప్రైవేట్ సంస్థలో వాచ్‌మెన్ గా పనిచేస్తున్నాడు.
అయితే తన స్నేహితుడైన వినోద్ ను తాను వాచ్‌మెన్ గా ఉంటున్న అపార్ట్‌మెంట్‌కు పక్కనే ఉన్న భవనంలో వాచ్‌మెన్ గా నియమించాడు. అయితే పని ఇప్పించిన వ్యక్తి భార్యపైనే వినోద్ అత్యాచారానికి పాల్పడ్డాడు.

చెన్నైలో వివాహితపై గ్యాంగ్ రేప్
చెన్నెలోని టీ నగర్ సౌత్ బోగ్ రోడ్డులోని ఓ అపార్ట్‌మెంట్ లో వాచ్ మెన్ గా పనిచేస్తున్న వినోద్ అనే వ్యక్తి తనకు పని ఇప్పించిన తన స్నేహితుడి భార్యపై గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డాడు. ఆమెను బెదిరించి మరీ అత్యాచారం చేశారు. వివాహిత కేకలు వేస్తే బెదిరింపులకు పాల్పడి మరీ అత్యాచారానికి దిగాడు.

మద్యం మత్తులో రేప్
వినోద్ స్నేహితుడు రాత్రిపూట తాను పనిచేసే ప్రైవేట్ కంపెనీలో విధులకు వెళ్ళాడు. అయితే అప్పటికే తన స్నేహితులతో కలిసి వినోద్ మద్యం తాగారు. నేరుగా తనకు ఉద్యోగం ఇప్పించిన స్నేహితుడి ఇంటికి వెళ్ళి తలుపుకొట్టాడు. అయితే రాత్రి పూట విధులకు హజరైన భర్త వచ్చాడని భార్య భావించింది. తలుపులు తీసింది. తలుపులు తీసిన వెంటనే వినోద్ లోపలికి ప్రవేశించారు. అయితే ఆమెను బెదిరించి రేప్ కు పాల్పడ్డారు.

పిల్లలను చంపుతామని బెదిరింపులు
బాధితురాలు తలుపులు తీయగానే నిద్రిస్తున్న పిల్లలను చంపేస్తామని వినోద్ బెదిరింపులకు పాల్పడ్డారు. పిల్లలను చంపుతామని పిల్లల వద్దకు వెళ్ళారు. దీంతో పిల్లలను రక్షించుకొనేందుకు బాధితురాలు నోరు మెదపలేదు. దీంతో ఆమెపై నిందితుడు రేప్ కు పాల్పడ్డారు.

పోలీసులకు ఫిర్యాదు
రాత్రి పూట విధుల నుండి ఇంటికి వచ్చిన భర్తకు బాధితురాలు అసలు విషయాన్ని చెప్పింది. ఈ విషయం తెలిసిన వెంటనే బాధితురాలిని తీసుకెళ్ళి ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ విషయమై మాంబళం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన వినోద్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. కేసును విచారిస్తున్నారు.
-
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్












Click it and Unblock the Notifications