షాక్: శశికళ రాజభోగాలు లీక్ చేశాడని ఖైదీని చావబాదారు, పరిస్థితి విషమం
పరప్పన జైలులో శశికళ రాజభోగాలు అనుభవిస్తున్నట్లు వార్తలు, వీడియోలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఈ విషయాన్ని లీక్ చేశారంటూ జైలులోని ఓ ఖైదీని చావబాదినట్లు సమాచారం.
బెంగళూరు: బెంగళూరు పరప్పన జైలులో శిక్ష అనుభవిస్తున్న అన్నాడీఎంకే నాయకురాలు శశికళకు.. జైలోలోనే రాజభోగాలు అందుతున్నాయన్న వార్తలు ఇటీవల సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.

రూపపై వేటు
ఐదు గదులతో శశికళ రాజభోగాల వీడియో కూడా లీకైంది కూడా. కాగా, శశికళ రాజభోగాలపై ఫిర్యాదు చేసిన జైళ్ల శాఖ డీఐజీ రూపపై సిద్ధరామయ్య ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేగాక, ఆమెపై బదిలీవేటు వేసింది.

లీక్ చేశారంటూ చావబాదారు
కాగా, ఆ సమాచారం రూపకు చేరవేశాడనే కారణంతో ఓ ఖైదీని జైలర్లు చితకబాదినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పరప్పన జైలు నుంచి ముగ్గురు ఖైదీలను బెళగావిలోని హిండలగా జైలుకు తరలించారు.

ఆ ఖైదీ పరిస్థితి విషమం
అక్కడికి చేరేసరికే వారిలో ఒకరైన అనంతమూర్తి పరిస్థితి విషమంగా మారింది. రక్తం గడ్డ కట్టడంతోపాటు మూత్రవిసర్జన సమస్యగా మారింది. అంతకుముందు ఆయనను పరప్పన జైలర్లు బాగా కొట్టినట్టు చెబుతున్నారు. ప్రస్తుతం బెళగావి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అనంతమూర్తికి చికిత్స అందిస్తున్నారు.

విచారణ
మరోవైపు వినయ్‌కుమార్ కమిటీ పరప్పన జైలులో తన విచారణ ప్రారంభించింది. అయితే, కమిటీ రావడానికి రెండు రోజుల ముందే శశికళకి కేటాయించిన ప్రత్యేక సౌకర్యాలన్నింటినీ అధికారులు హడావిడిగా తొలగించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాజభోగాలు లేకుండా శశికళ సాధారణ ఖైదీగా ఉన్నట్లు సమాచారం.
-
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications