viral:వావ్ దియా.. డాటర్ ఆఫ్ యాక్టర్ సూర్య, ఎస్ఎస్‌సీ మార్కుల్లో సత్తా, మ్యాథ్స్‌లో బైకి బై
తమిళ హీరో సూర్య కూతురు దియా.. ఎస్ఎస్సీలో టాప్ లేపింది. 500 మార్కులకు గానూ 487 మార్కులను సాధించింది. ఆమె సత్తాచాటడంతో ఒకరు పోస్ట్ చేశారు. ఇంకేముంది తెగ వైరల్ అవుతుంది. సూర్య.. నటి జ్యోతికను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి కూతురు దియా, కుమారుడు దేవ్ ఉన్నారు. కూతురు దియా పదో తరగతి పూర్తయ్యింది. చదవుల్లో అమ్మాయి సత్తా చాటింది.
దియా.. క్లాస్ ఫస్ట్
దియా గురించి ఇదివరకు చాలా సందర్భాల్లో సూర్య చెప్పాడు. క్లాస్ ఫస్ట్ వస్తుందని చెప్పేవాడు. పదో తరగతి ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించింది. అన్ని సబ్జెక్టుల్లో 90కి పైగా మార్కులు సాధించింది. మ్యాథ్స్‌లో అయితే వందకు వంద తెచ్చుకుంది. ఆమెకు మాతృభాష తమిళంలో 95, సోషల్‌లో 95, సైన్స్‌లో కూడా 95, ఇంగ్లిష్‌లో 99 సాధించింది. లెక్కలలో బైకి బై తెచ్చుకుంది. ఈ మేరకు పొలిమర్ న్యూస్ పోస్ట్ చేసిందని సాహిత్య ట్వీట్ చేసింది.

మార్క్స్ లిస్ట్ వైరల్
దియా మార్స్క్ లిస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. చాలా మంది కంగ్రాట్స్ అని చెబుతున్నారు. తల్లిదండ్రులకు తగ్గట్టు.. మంచి పేరు తీసుకొచ్చావ్ అని రాసుకొచ్చారు. కంగ్రాట్స్ దియా అంటూ అంతా రిప్లై ఇచ్చారు. ఆమె మొత్తం మార్కుల్లో 13 మార్కులనే కోల్పోయారు. ఇంగ్లిష్‌లో కూడా 99 మార్కులను సాధించారు. ప్రతీ సబ్జెక్టులో 95 కన్నా తక్కువ మార్కులను పొందలేదంటే.. ఆమె చదువుల్లో ఏ స్థాయిలో ప్రతిభ చూపుతుందో అర్థం చేసుకోవచ్చు.

దేవ్‌కు సవాల్
దియా తన తమ్ముడు దేవ్‌కు ఆదర్శంగా నిలిచింది. అంతేకాదు తన మార్కుల కన్నా ఎక్కువ తీసుకురావాలని ఛాలెంజ్ విసిరింది. అద్భుతంగా చదివి.. 487 మార్కులను సాధించింది. దీనిని బీట్ చేయాలంటే దేవ్ మరింత కష్టపడాల్సిందే. కానీ నటుల పిల్లలు.. చదువుల్లో కూడా రాణిస్తున్నారు. చాలా కొంతమంది మాత్రమే సరస్వతీ బిడ్డలుగా మారుతున్నారు. ఎందుకంటే వారికి రాయల్ లైఫ్ ఉంటుంది. చదువు కన్నా స్పోర్ట్స్.. లేదంటే సినిమాలపై ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. చదివేవారు తక్కువ.. ఆ జాబితాలో దియా చేరింది.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications