ఎవడ్రా వీడు- బిజీ బెంగళూరు రోడ్లపై బిచాణా వేశాడు..!!
బెంగళూరులో ఓ ఆశ్చర్యకరమైన సంఘటన చోటు చేసుకుంది. నగరంలోని అత్యంత రద్దీగా ఉండే ఓ రోడ్డు మధ్యలో ఓ వ్యక్తి మ్యాట్రెస్ వేసుకుని నిద్రపోవడం కనిపించింది. కాలు మీద కాలు వేసుకుని దర్జాగా కునుకు తీశాడు. వాహనాల కదలికలు, హారన్ల మధ్య జరిగిన ఈ సంఘటన.. ట్రాఫిక్ నిలిచిపోవడానికి కారణమైంది. బెంగళూరులో అసలే ట్రాఫిక్ సమస్య ఎక్కువ. ఈ వ్యక్తి చేసిన పనికి ఆ మార్గంలో వాహనాలు మరింత స్తంభించిపోయాయి.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రోడ్డు మధ్యలో మెరూన్ రెడ్ కలర్ మ్యాట్రెస్ వేసుకుని ఆ వ్యక్తి పడుకోవడం, బనశంకరి వైపు వెళ్తోన్న ఓ బీఎంటీసీ బస్సు, దాని పక్కనే ఓ కారు నిలిచివుండటం ఈ వీడియోలో స్పష్టంగా రికార్డయింది. వాహనాలు పెద్ద సంఖ్యలో నిలిచిపోయినప్పటికీ.. ఆ వ్యక్తి ఏమాత్రం పట్టించుకోకుండా కాలు మీద కాలు వేసుకుని నిద్రపోవడం చూడొచ్చు.

ఈ ఘటన పట్ల ఆందోళన వ్యక్తమైంది. బెంగళూరు రోడ్లపై ఇలాంటి గందరగోళం చూడటం షాకింగ్‌గా ఉందని దీన్ని పోస్ట్ చేసిన యూజర్ వ్యాఖ్యానించాడు. ఈ వీడియోను బెంగళూరు ట్రాఫిక్ పోలీస్ విభాగానికి ట్యాగ్ చేశాడు. ఆ వ్యక్తి మానసిక సమస్యలతో బాధపడుతున్నాడా? లేక ఉద్దేశపూరకంగా ఇలా చేస్తున్నాడా? అనేది తెలియరావట్లేదు. ఇలా చేయడం అతని ప్రాణాలకే కాకుండా, ప్రయాణికులకు కూడా ప్రమాదమని పేర్కొన్నాడు
ఇలాంటి సంఘటనలపై అధికారులు వెంటనే స్పందించి, అడ్డంకులను తొలగించాలని, ట్రాఫిక్ సమస్యను తక్షణమే పరిష్కరించాలని కర్ణాటక పోర్ట్ ఫోలియో అనే ట్విట్టర్ యూజర్ విజ్ఞప్తి చేసింది. రద్దీగా ఉండే రోడ్డు మధ్యలో ఒక వ్యక్తి మ్యాట్రెస్ వేసుకుని పడుకోవడం వల్ల సెయింట్ జోసెఫ్ యూనివర్శిటీ బస్టాప్ సమీపంలో.. భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయని తెలిపింది.
Madness on Bengaluru Roads: Man Spotted Sleeping in the Middle of Traffic”
— Karnataka Portfolio (@karnatakaportf) September 17, 2025
It is shocking to see the kind of chaos unfolding on Bengaluru’s busy roads. In a bizarre incident, a man was found sleeping right in the middle of a running road on a mattress, bringing traffic to a… pic.twitter.com/72pbReS9L2
దీనిపై బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు స్పందించారు. ఈ సంఘటన జరిగిన ప్రదేశం గురించి వివరాలు అడిగారు. సెయింట్ జోసెఫ్స్ యూనివర్సిటీ బస్ స్టాప్ సమీపంలో ఈ సంఘటన జరిగిందని కర్ణాటక పోర్ట్‌ఫోలియో వెల్లడించింది. వెంటనే బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు హలసూరు గేట్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌కు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.












Click it and Unblock the Notifications