ఇది చాలా హాట్ గురూ: కొత్తగా పెళ్లయిన జంటకు కాస్లీ బహుమతి ఇచ్చిన మిత్రులు

కడలూరు: ఒక పెళ్లికి వెళుతుంటే మనతో పాటు ఒక మంచి గిఫ్ట్ తీసుకెళుతాం. గిఫ్ట్ ఇచ్చి నవదంపతులకు బెస్ట్ విషెస్ చెబుతాం. అంతేకాదు ఇచ్చే గిఫ్ట్ కూడా చాలా కాస్లీగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటాం. ఎందుకంటే ఇచ్చే కానుక సరిగ్గా లేకుంటే నవ్వులపాలవుతామనే భయం వెంటాడుతుంది. అందుకే మన స్తోమతకు మించి మంచి గిఫ్ట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం. తమిళనాడులో కూడా ఇలానే ఓ వివాహ కార్యక్రమానికి హాజరైన పెళ్లికొడుకు మిత్రులు వారికి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు. ఆ గిఫ్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో మోస్ట్ ట్రెండింగ్‌గా నిలిచింది.

తమిళనాడు రాష్ట్రం కడలూరులోని మంజకుప్పంలో ఓ వివాహం జరిగింది. ఈ వివాహానికి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు తరపున స్నేహితులు హాజరయ్యారు. వారికి శుభాకాంక్షలు చెబుతూ వారికి బొకే ఇచ్చారు. బొకే అంటే పూల బొకే కాదండోయ్... ఆనియన్ బొకే. అవును మీరు చదివింది నిజమే.. ఆ దంపతులకు ఇచ్చింది ఆనియన్ బొకేనే. రెండున్నర కిలోల ఉల్లిపాయలతో ఈ బొకేను తయారు చేశారు. పెళ్లికొడుకు తరపున మిత్రులు ఈ ఆనియన్ బొకేను నవదంపతులకు బహూకరించారు.

Viral:Newly wedded Couple in Tamilnadu recieves Onion boquet as gift

ఒక్కసారిగా ఆనియన్ బొకేను బహూకరించడంతో పెళ్లికొచ్చిన బంధువుల దృష్టి వీరిపై పడింది. ఎంజాయ్ చేశారు. ఇక ఈ ఉల్లిపాయలతో కూడిన బొకేను ఇస్తుండగా తీసిన ఫోటోను వీరు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. వెంటనే ఇది ట్విటర్‌లో వైరల్ అయ్యింది. అంతేకాదు ఈ ఫోటోను నెటిజెన్లు తెగ షేర్ చేసేస్తున్నారు. అసలే ఉల్లి ధరలు కొండెక్కి కూర్చోవడంతో ప్రస్తుతం ఇదే అత్యంత కాస్లీ గిఫ్ట్ అని నెటిజెన్లు కామెంట్ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా కిలో ఉల్లి ధరలు రూ.150 మార్కును తాకుతున్న నేపథ్యంలో చాలా రెస్టారెంట్లు ఉల్లికి గుడ్‌బై చెప్పేశాయి.

ఇక కిలో ఉల్లి నూ.195 అమ్ముతున్నారని తమలాంటి సామాన్యులకు ఇది చాలా ఎక్కువ అని చెప్పుకొచ్చారు పెళ్లికొడుకు స్నేహితులు. కడలూరులోని ఓ దుకాణంలో రెండున్నర కిలోల ఉల్లిని రూ.500 పెట్టి కొనుగోలు చేసి ఇలా బొకేలా తయారు చేసి నవదంపతులకు గిఫ్ట్‌గా ఇచ్చినట్లు చెప్పారు. ఇక తమిళనాడులో ఉల్లి ధరలు కిలో రూ.150 నుంచి రూ.150 వరకు ఉన్నట్లు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+