Viral Video:హోటల్‌లోకి ప్రవేశించిన సింహం... లోపల ఈ మృగరాజు ఏం చేసిందంటే..?

జునాగఢ్: అది గుజరాత్‌లోని జునాగఢ్ ప్రాంతం. అప్పుడే తెల్లవారుతోంది. సమయం ఉదయం 5 గంటలు కావొస్తోంది. ఇంకా జనాల సందడి రహదారులపై కనిపించలేదు. అప్పుడప్పుడే తెల్లవారుతోంది. జునాగఢ్ మంచి పర్యాటక ప్రాంతంగా గుర్తింపు ఉంది. ప్రతి రోజు పెద్ద సంఖ్యలో పర్యాటకులు జునాగఢ్‌కు వస్తుంటారు. అందుకే అక్కడి హోటల్స్ ఎప్పుడూ కిటకిటలాడుతూ కనిపిస్తుంటాయి. జునాగఢ్ సింహాలకు ప్రసిద్ధి. తరచూ సింహాలు ప్రధాన రహదారులపై అలా వచ్చి పలకరించి పోతుంటాయి. అందుకే అక్కడి స్థానికులు చాలా జాగ్రత్తగా ఉంటారు. ఇక జునాగఢ్‌లోని ఓ హోటల్‌లోకి అనుకోని అతిథి ప్రవేశించింది. ఇంతకీ ఎవరు ఆ అతిథి ఏమా కథ..?

తెల్లవారు జామున సింహం ఎంట్రీ

తెల్లవారు జామున సింహం ఎంట్రీ

జునాగఢ్‌లోని సరోవర్ పోర్టికో అనే హోటల్‌లోకి అనుకోని అతిథి ప్రవేశించింది. ఉదయం 5 గంటల ప్రాంతంలో ఆ అతిథి ప్రవేశించడంతో అంతా ఉలిక్కిపడ్డారు. అప్పటికీ నిద్రలేవని వారు సైతం ఉలిక్కిపడి నిద్రలేచి ఆ అతిథిని చూసి భయభ్రాంతులకు గురయ్యారు. ఇంతకీ ఆ అతిథి ఎవరో కాదు.. జునాగఢ్ ప్రాంతంలోనే నివసించే ఓ సింహం. అవును జునాగఢ్ ప్రాంతం సింహాలకు గుర్తింపు చెందింది. ఇక కథ అసలు విషయానికొద్దాం.

సెక్యూరిటీ గేట్ దూకి లోపలికి

సరోవర్ పోర్టికో హోటల్ ఎంట్రీ గేట్ నుంచి ఓ సింహం లోపలికి దూకుతున్న దృశ్యాలను సీసీ కెమెరా కంటికి చిక్కాయి. అక్కడే గేటు వద్ద ఉన్న సెక్యూరిటీ క్యాబిన్‌లో ఉన్న వాచ్‌మెన్ ఇది చూసి హడలెత్తిపోయాడు. వెంటనే హోటల్ అధికారులను అలర్ట్ చేశాడు. అలా గేటు దూకేసి లోపలికి పరుగులు తీసింది ఈ సింహం. అక్కడ కాసేపు గందరగోళం వాతావరణం నెలకొంది. ఎవరూ గదుల్లోనుంచి బయటకు రావొద్దంటూ ఆదేశాలు పంపింది హోటల్ సిబ్బంది. బయటకు వస్తే సింహం పంజా విసిరే అవకాశాలున్నాయి.

రోడ్లపై సింహాలు రావడం సర్వసాధారణం

ఇదిలా ఉంటే జునాగఢ్ ప్రాంతంలో ఇలా సింహాలు రోడ్లపైకొచ్చి పలకరించడం సర్వసాధారణం. ఎందుకంటే దగ్గరలోనే గిర్ జాతీయ పార్కు ఉంది. అక్కడి నుంచే నివాస ప్రాంతాలకు సింహాలు అప్పుడప్పుడు గుంపులుగా కూడా వస్తుంటాయి. అయితే పెద్దగా హాని తలపెట్టవు. గిర్ జాతీయ పార్కు సింహాలకు ఇల్లులాంటిది.అయితే సింహాల సమూహం నుంచి దారితప్పి ఈ సింహం ఇలా రోడ్డుపైకి వచ్చిఉంటుందనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

సింహం హోటల్‌లో తిరుగుతుండగా...


ఇక హోటల్‌లోకి ప్రవేశించిన ఈ మృగరాజు అటూ ఇటూ తచ్చాడుతూ కనిపించింది. బయటకు లోపలికి పరుగులు తీసింది. అయితే సింహం లోపల ఉన్నంతసేపు ఒక్క పురుగు కూడా బయట కనిపించలేదు. అంతా తమ గదులకే పరిమితమయ్యారు. అలా కాసేపు హోటల్‌లో కలియతిరిగాక హోటల్ నుంచి బయటకు వెళ్లింది. దీంతో అంతా ఊపిరి తీసుకున్నారు. సెక్యూరిటీ గార్డు అయితే గేటు వద్ద ఉన్న కేబిన్‌ డోర్‌ను వేసుకుని ఊపిరి బిగపట్టుకుని కూర్చున్నాడు. ఇక వచ్చిన దారిలోనే సింహం బయటకు వెళ్లడంతో ఊపిరి తీసుకున్నాడు.

మొత్తానికి అక్కడ సింహాలు ప్రధాన రహదారులపైకి రావడం చాలా సర్వసాధారణం అని అక్కడి స్థానికులు చెబుతున్నారు. అయితే అవి చాలావరకు హాని తలపెట్టవని కూడా వారు చెబుతున్నారు. అయితే సింహం హోటల్‌లోకి దూరడంతో కాస్త ఆందోళనకర వాతావరణం కనిపించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+