యువతను ఊపేస్తోన్న నయా సెల్ఫీ ట్రెండ్
అమెరికా : ట్రెండ్ అంటూ ఫాలో అయిన ఏదైనా సరే.. కొంతకాలానికి రొటీన్ గా మారిపోవడం కామన్. రొటీన్ కు భిన్నంగా ఆలోచించేవాళ్లెవరైనా.. మరో కొత్త ట్రెండ్ సెట్ చేసేదాకా పాత ట్రెండ్ అలా కొనసాగుతూ ఉంటుంది. అచ్చు ఇదే తరహాలో.. సెల్ఫీలు దిగి దిగి బోరు కొట్టిందో లేక కొత్తగా ట్రై చేయాలన్న కుతూహలం పుట్టిందో గానీ ఓ కుర్రాడు నయా సెల్ఫీ ట్రెండ్ కు నాంది పలికాడు.
'హై ఫైవ్ సెల్ఫీ' ట్రెండ్ పేరిట ఇప్పుడీ సెల్ఫీ సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఇంతకీ ఏంటి దీని స్పెషాలిటీ అనుకుంటున్నారా! జస్ట్ కెమెరాను ఆన్ చేసి, క్లిక్ మనిపించిన వెంటనే .. మొబైల్ ను గాల్లోకి ఎగిరేసి.. కెమెరా వైపు చూస్తూ చప్పట్లు కొట్టాలి. అలా.. మీరు చప్పట్లు కొట్టిన దృశ్యం కెమెరాలో బంధించబడాలి.

ఇప్పుడిదే నయా ట్రెండ్. సేత్ స్నీడర్ అనే యువకుడు ఇలాంటి ఓ సెల్ఫీని తన సోషల్ మీడియా ఖాతాలో అప్ లోడ్ చేయగా.. 4 లక్షల 40 వేల మంది లైక్ లు, రెండు లక్షల కామెంట్లు రావడం విశేషం. ఇదిలా ఉంటే, ఇప్పటికే సెల్ఫీ మోజులో పడి.. ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్న ఘటనలు పెరిగిపోతుండగా.. ఇప్పుడిలాంటి కొత్త ట్రెండ్ తో యువత ఇంకెలాంటి పోకడలు పోతారోనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.












Click it and Unblock the Notifications