మహిళ చెంప చెల్లుమనిపించిన ర్యాపిడో రైడర్.. పచ్చి బూతులు తిడుతూ.. వీడియో వైరల్
దేశంలోని మెట్రో నగరాల్లో ఈ మధ్యకాలంలో బైక్ ట్యాక్సీలు పెరిగిపోయాయి. ర్యాపిడో, ఉబర్, ఓలా రైడ్స్ ఊపందుకున్నాయి. విద్యార్థులు, ఉద్యోగులు నిత్యం బైక్ ట్యాక్సీలను ఆశ్రయిస్తున్నారు. సమయం ఆదాతోపాటు తక్కువ ఖర్చుతో జర్నీ పూర్తవుతుందని భావిస్తున్నారు. అయితే బెంగళూరులో ఓ ర్యాపిడో రైడర్ చేసిన పని ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజెన్లు అతడ్ని పచ్చిబూతులు తిడుతున్నారు. ఇంతకీ ఆ రైడర్ చేసిన పని ఏంటి..?
బెంగళూరులోని జయనగర్ లో షాకింగ్ ఘటన జరిగింది. ఓ మహిళా ప్రయాణికురాలిపై ర్యాపిడో రైడర్ దురుసుగా ప్రవర్తించాడు. నడిరోడ్డుపై మహిళ చెంప చెల్లుమనిపించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. బెంగళూరులోని జయనగర్ కు చెందిన ఓ మహిళ జ్యుయలరీ షాపులో పనిచేస్తుంది.
అయితే ఆమె ర్యాపిడో బుక్ చేసుకుంది. ర్యాపిడ్ రైడర్ ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నట్లు గమనించింది. దీంతో ఆమె నెమ్మదిగా వెళ్లాలని సూచించింది. కానీ ఆ రైడర్ వినకపోవడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చెలరేగింది. సదరు మహిళ ఇంగ్లీష్ లో మాట్లాడుతుండగా.. ర్యాపిడో రైడర్ కన్నడలో మాట్లాడాడు. దీంతో వారిద్దరి మధ్య వివాదం ఇంకా తీవ్రతరం అయింది. ఈ క్రమంలో కంట్రోల్ తప్పిన ఆ వ్యక్తి మహిళపై చేయి చేసుకున్నాడు. నడి రోడ్డుపై అందరూ చూస్తుండగానే మహిళా ప్రయాణికురాలి చెంప చెల్లుమనిపించాడు. దీంతో ఆమె కిందపడి పోయింది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

ఈ ఘటనపై తాజాగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ వీడియో చూసిన నెటిజెన్లు ర్యాపిడో రైడర్ ను పచ్చిబూతులు తిడుతూ కామెంట్స్ పెడుతున్నారు. మరోవైపు కర్ణాటక ప్రభుత్వం ఇటీవల సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో జూన్ 16 నుంచి బైక్ ట్యాక్సీలను నిషేధిస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది. బైకులను కమర్షియల్ ట్రాన్స్ పోర్ట్ వాహనాలుగా వినియోగించ వద్దని సిద్ధరామయ్య సర్కార్ స్పష్టం చేసింది.
A #Rapido bike taxi driver in #Bengaluru allegedly assaulted a woman passenger after a dispute over rash driving. The incident in #Jayanagar, caught on camera, has gone viral and sparked outrage. pic.twitter.com/DFMEORwHjC
— India Focus Daily (@indiafocusdaily) June 16, 2025
అయితే కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని బైక్ ట్యాక్సీలు తప్పు బట్టాయి. ఈ మేరకు హైకోర్టును ఆశ్రయించాయి. సిద్ధరామయ్య ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు సమర్థించింది. కర్ణాటక రవాణాశాఖ రూల్స్ ప్రకారం.. టూ వీలర్స్ ను వాణిజ్య సేవలకు వినియోగించకూడదన్న నిబంధనను హైకోర్టు సమర్థించింది.












Click it and Unblock the Notifications