Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సినిమాలోని సీన్ చూసి- నోట్ల కట్టలను చిత్తు కాగితాల్లా విసిరేశాడు..

వేగంగా వెళ్తోన్న కారు డిక్కీలో నుంచి ఓ యువకుడు నోట్లను గాల్లోకి విసిరేసిన ఘటన గుర్‌గావ్ లో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

చండీగఢ్: డబ్బులను ఇష్టానుసారంగా గాల్లోకి విసిరేసే సంఘటనలు ఈ మధ్యకాలంలో తరచుగా సంభవిస్తోన్నాయి. హైదరాబాద్ చార్మినార్ లో ఓ వ్యక్తి మొన్నీ మధ్యే 500 రూపాయల నోట్లను గాల్లోకి విసిరేశాడు. చార్మినార్ చౌరస్తాలో నిల్చుని మరీ- వాటిని వెదజల్లాడు. అప్పట్లో దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

బెంగళూరులో కూడా ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది. కృష్ణరాజ మార్కెట్ ఫ్లైఓవర్ పై నిల్చుని ఓ వ్యక్తి నోట్ల కట్లను గాల్లోకి విసిరేశాడు. అన్నీ 500 రూపాయల నోట్లే. అత్యంత రద్దీగా ఉండే మార్కెట్ ఏరియా అది. అలాంటి చోట ఫ్లైఓవర్ పై నిల్చుని గాల్లోకి నోట్లను విసిరేయడంతో వాటిని అందుకోవడానికి జనం ఎగబడ్డారు.

Viral Video: A man was throwing currency notes from his running car in Gurgaon, Police file a case

అప్పట్లో పెద్ద ఎత్తున ఈ వీడియో కూడా వైరల్ గా మారింది. తన వెంట తెచ్చుకున్న సంచిలో నుంచి నోట్లను వెదజల్లాడు. దీనితో ఫ్లై ఓవర్, దాని కింద ఉన్న ప్రయాణికులు వాటిని అందుకోవడానికి ప్రయత్నించారు. పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది. ఆ నోట్లను లాక్కోవడానికి జనం ప్రయత్నించారప్పట్లో.

ఇప్పుడు తాజాగా- అలాంటి ఘటనే హర్యానాలోని గుర్‌గావ్ లో చోటు చేసుకుంది. గోల్ఫ్ కోర్స్ రోడ్డులో ఓ యువకుడు రన్నింగ్ కారు డిక్కీలో కూర్చుని నోట్లను రోడ్డు మీదికి విసిరేశాడు. వేగంగా వెళ్తోన్న కారులో నుంచి వాటిని విసిరేయడంతో చాలాదూరం వరకు గాల్లో తేలుకుంటూ వెళ్లాయా నోట్లు. డీఎల్ 10 సీపీ 7142 కారు అది.

ఆ కారు వెనుకే వస్తోన్న ఓ వ్యక్తి- ఈ తతంగం మొత్తాన్నీ సెల్ ఫోన్ లో బంధించాడు. దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ వెంటనే అది వైరల్ గా మారింది. పోలీసుల దృష్టికి చేరింది. దీనిపై పోలీసులు రంగంలోకి దిగారు. విచారణ చేపట్టారు. ఓ సినిమాలోని సీన్‌ ను చూసి దాన్ని అలాగే రీక్రియేట్ చేయడానికి ఆ యువకుడు ప్రయత్నించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. వారిపై కేసు నమోదు చేసినట్లు గుర్ గావ్ డీఎల్ఎఫ్ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ వికాస్ కౌశిక్ తెలిపారు. నిందితుడిని గుర్తించామని అన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+