viral video: పెళ్ళిలో చిచ్చు పెట్టిన ఎక్స్‌ట్రా అప్పడం; ఓ రేంజ్ లో ముష్టియుద్ధం!!
కట్నాలు కానుకల వ్యవహారంలో తేడా వచ్చి పెళ్లిలో గొడవలు జరగడం చూసుంటారు కానీ, ఒక అప్పడం కోసం పెళ్లిలో వీర లెవల్లో జరిగిన ఫైటింగ్ ఎక్కడైనా చూశారా? అలా చూడలేదు అంటే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కేరళ రాష్ట్రంలో జరిగిన ఒక పెళ్ళిలో ఎక్స్ ట్రా అప్పడం కోసం జరిగిన ఫైటింగ్ చూసేయండి. ఓర్ని.. ఒక అప్పడం కోసం ఇంతలా తన్నుకుంటారా అని ఆశ్చర్య పోకుండా ఉండరు.

ఎక్స్ ట్రా అప్పడం అడిగితే ఇవ్వని వడ్డించేవారు, ముష్టియుద్ధానికి కారమైన అప్పడం
ఇంతకీ ఏం జరిగిందంటే కేరళ రాష్ట్రంలోని అలప్పుజా జిల్లాలో ఒక పెళ్లిలో ఒక అప్పడం కారణంగా ఊహించనంత పెద్ద ఘర్షణ చోటు చేసుకుంది. వరుడి స్నేహితులు ఎక్స్ ట్రా అప్పడం అడగగా ఇవ్వకుండా ఆడ పెళ్ళి వారు వాటిని తిరస్కరించడంతో గొడవ జరిగింది. వాగ్వాదం ప్రారంభమైన తర్వాత అది క్రమంగా తీవ్రమైన కొట్లాటగా మారింది. ఇక ఈ వ్యవహారంలో పోలీసుల జోక్యం అవసరమయ్యే ముష్టియుద్ధంగా మారిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ..
ఆన్‌లైన్‌లో సర్క్యులేట్ అవుతున్న ఒక వీడియో పూర్తిగా అప్పడం కోసం జరిగిన ముష్టి యుద్ధాన్ని చూపిస్తుంది. ఈ వీడియోలో వ్యక్తులు గుంపులు గుంపులుగా వీరంగం సృష్టించారు. ఒకరిని ఒకరు గుద్దటం, ఒకరినొకరు తన్నుకోవడం, పిడికిలి బిగించి బలంగా కొట్టడమే కాకుండా, వడ్డించే గిన్నెలు, బక్కెట్లతోనూ దాడులు చేసుకున్నారు. కుర్చీలు, బల్లలు కూడా ఒకరిపై ఒకరు విసురుకునే స్థాయికి ఫైటింగ్ జరిగింది.100 శాతం అక్షరాస్యత ఉన్న గొప్ప రాష్ట్రమైన కేరళలో, కేవలం అప్పడం కోసం జరిగిన ఘర్షణ చూసిన వారందరికీ షాక్ కి గురి చేసింది.

100శాతం అక్షరాస్యత ఉన్న రాష్ట్రంలో అప్పడం కోసం కొట్టుకున్నారని సెటైర్లు
ఇక ఘర్షణ ఉద్రిక్తంగా మారడంతో జోక్యం చేసుకున్న అలప్పుజా పోలీసులు 10 మందిపై కేసు నమోదు చేశారు. ఘర్షణకు దిగిన వారిని గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నారు. ఇక ఈ అప్పడం గొడవ చూసినవారంతా అసలు ఇంతకీ పెళ్లి జరిగిందా? అని ప్రశ్నిస్తున్నారు. ఇక మరికొందరు వంద శాతం అక్షరాస్యత ఉన్న రాష్ట్రంలో చండాలంగా అప్పడం కోసం కొట్టుకోవడం ఏంటని కామెంట్ చేస్తున్నారు. అప్పడం కోసం కేరళ రాష్ట్రం పరువు తీస్తున్నారని మండిపడుతున్నారు. సోషల్ మీడియాలో ఈ వీడియో పై నెటిజన్లు తమదైన శైలిలో సెటైర్లు పేలుస్తున్నారు.












Click it and Unblock the Notifications