Viral Video: కొబ్బరికాయలో నీళ్లు తక్కువగా ఉన్నాయని.. రోడ్డుపై రచ్చ రచ్చ!

Viral Video: కొబ్బరికాయలో నీళ్లు తక్కువగా ఉన్నాయనే ఓ చిన్నపాటి కారణం లక్నో వీధుల్లో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. వినియోగదారులు, వ్యాపారుల మధ్య కొబ్బరికాయల్లో నీటి శాతంపై మొదలైన వాగ్వాదం చివరికి కర్రలతో పరస్పరం దాడులు చేసుకునేంత స్థాయికి ముదిరింది. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని విభూతిఖండ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ విచిత్ర ఘర్షణ స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

viral video: సినిమా టికెట్ల కోసం పొట్టుపొట్టు కొట్టుకున్న మహిళలు..
viral video: సినిమా టికెట్ల కోసం పొట్టుపొట్టు కొట్టుకున్న మహిళలు..

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. విభూతిఖండ్ ప్రాంతంలోని ఓ కొబ్బరి బోండాల బండి వద్దకు కొందరు వినియోగదారులు వచ్చి కొబ్బరికాయలు కొనుగోలు చేశారు. అయితే కొబ్బరికాయలు కొట్టిన తర్వాత అందులో నీరు చాలా తక్కువగా ఉండటంతో వినియోగదారులు వ్యాపారితో వాగ్వాదానికి దిగారు. కాయలు మార్చాలని లేదా డబ్బులు తక్కువగా తీసుకోవాలని వినియోగదారులు కోరగా.. వ్యాపారి ఇందుకు నిరాకరించాడు. దీంతో ఇరువర్గాల మధ్య మాటమాట పెరిగి గొడవ పెద్దదైంది.

Viral Video Fight Breaks Out In Lucknow Over Less Water In Coconut Police arrested 7 people Details

ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. గొడవ తీవ్రరూపం దాల్చడంతో కొబ్బరి బోండాలు అమ్మే వ్యక్తి ఆవేశంతో కర్ర తీసుకుని వినియోగదారులపై దాడికి దిగాడు. ఈ క్రమంలో ఇరువర్గాల వారు పరస్పరం దాడులు చేసుకోవడంతో ఆ ప్రాంతమంతా గందరగోళంగా మారింది. ఈ దాడి దృశ్యాలు అక్కడున్న వారిని భయాందోళనకు గురి చేశాయి. రోడ్డుపై వెళ్లేవారు కూడా ఈ గొడవను చూసి అవాక్కయ్యారు.

నితీష్ భాయ్.. అది ఫ్రీ హిట్ రా బాబు!(వీడియో)
నితీష్ భాయ్.. అది ఫ్రీ హిట్ రా బాబు!(వీడియో)

సమాచారం అందుకున్న విభూతిఖండ్ పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితులను అదుపులోకి తెచ్చారు. ఘటనకు సంబంధించి ఇరువర్గాలకు చెందిన ఏడుగురిని అదుపులోకి తీసుకున్నట్లు ఈస్ట్ డీసీపీ దీక్షా శర్మ వెల్లడించారు. అదుపులోకి తీసుకున్న వారిని తీవ్రంగా విచారిస్తున్నామని, పరారీలో ఉన్న మరో నలుగురి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపడుతున్నామని ఆమె తెలిపారు. ఓ చిన్న కారణం ఇంతటి శారీరక ఘర్షణకు దారితీసిందనే కోణంలో సమగ్ర దర్యాప్తు జరిపి, బాధ్యులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+