viral video: కుప్పకూలిన హోటల్ -భారీ వర్షాల్లో అనూహ్య ఘనట -తృటిలో తప్పిన విషాదం
భారత వర్షాలతో అతలాకుతలం అవుతోన్న ఉత్తరాఖండ్ రాష్ట్రంలో భారీ వరదలు, కొండచరియలు విరిగిపడటం సాధారణంగా మారింది. అయితే, జన సమర్థం అధికంగా ఉండే ప్రాంతాల్లోనూ కొండచరియలు విరిగిపడటం ప్రాణ నష్టానికి దారితీసింది. తాజాగా కొండ అంచునున్న ఓ హోటల్ లోయలోకి కుప్పకూలిన ఘటన తాలూకు వీడియో వైరలైంది..
ఉత్తరాఖండ్ లో ప్రఖ్యాత జోషిమఠ్‌లోని ఝాడ్కుల అనే ప్రాంతంలో పర్యాటకులు ఎక్కువగా వచ్చే ఓ హోటల్ భవంతి పేకమేడలా కూలిపోయింది. హోటల్ బిల్డింగ్ భాగం ఒక్కసారిగా కూలడం, శిథిలాలు లోయలోకి జారి పడిన దృశ్యాలు వైరలయ్యాయి. కాగా,

వరుస ప్రమాదాల నేపథ్యంలో కొండవాలుగా ఉన్న భవంతులపై కన్నేసిన అధికారులు.. ఈ హోటల్ భవంతి కూలిపోయే ప్రమాదముందని ముందే గుర్తించారు. శనివారం ఉదయానికే ఆ హోటల్ లో ఉన్న టూరిస్టులు అందరినీ అధికారులు ఖాళీ చేయిచారు. జనాలను ఖాళీ చేయించిన కాసేపటికే ఆ హోటల్ కుప్పకూలింది..
హోటల్ మెయిన్ రోడ్డుకు అనుకోని ఉండగా పక్కనే పెద్ద లోయ ఉంది. వర్షాల కారణంగా లోయలోని మట్టి క్రమంగా జారీ కిందకు పోవడంతో భవనం కుప్పకూలిందని అధికారులు చెప్పారు. గతవారం కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో 9 మంది ప్రాణాలు కోల్పోయారు.
#WATCH | Uttarakhand: A part of a hotel building collapses near Jhadkula in Joshimath.
— ANI (@ANI) August 7, 2021
The administration had vacated the hotel this morning. pic.twitter.com/zaKgVkVLZq












Click it and Unblock the Notifications