ఆగ్రహంతో పోలీస్‌స్టేషన్‌కు భార్య..: భర్త పాటతో కౌగిట్లో వాలింది(వీడియో)
ఝాన్సీ: ఆ భార్యాభర్తల మధ్య ఏదో చిన్న గొడవ జరిగింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేసేందుకు ఆమె పోలీస్ స్టేషన్ వరకూ వెళ్లింది. ఎంత బతిమాలినా వినలేదు. అయితే, ఆమె భర్త ఆమె కోసం ఓ చక్కని పాట పాడాడు. దీంతో ఆమె కోపం పూర్తిగా చల్లారిపోయి భర్త కౌగిట్లో చేరిపోయింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఝాన్సీలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. భర్తతో అభిప్రాయ భేదాలు రావడంతో పుట్టింటికి వెళ్లిపోయింది ఓ భార్య. ఆ భార్యను ఇంటికి తీసుకురావడానికి వెళ్లిన భర్తకు నిరాశ ఎదురైంది. అంతేగాక, అతనిపై పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేసింది. దీంతో పోలీసులు భార్య భర్తలకు కౌన్సెలింగ్ ఇవ్వాలని నిర్ణయించారు.
ఈ క్రమంలో ఇద్దరినీ పోలీస్టేషన్‌కు పిలిపించారు. అక్కడ కూడా తన భర్తపై ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ఉంది భార్య. దీంతో ఆమెను శాంతింపజేయాలనుకున్న భర్త తన తియ్యని గొంతుతో ఓ చక్కని పాట అందుకున్నాడు.
'జినా..జినా..' అంటూ 'బాద్లాపూర్' సినిమాలోని పాటను పాడాడు. ఇంకేముంది.. ఆ భార్య కంటతడి పెట్టుకుంటూ వచ్చి భర్త కౌగిలిలో వాలిపోయింది. ఇదంతా అక్కడున్న వారు ఎవరో వీడియో తీశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. సదరు భర్తపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
-
గరుడ పురాణం ప్రకారం "భార్య" ఎన్ని రకాలు ఉంటారో తెలుసా..? -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!!












Click it and Unblock the Notifications