Viral Video:గుంతలో మాటేసిన చిరుత..ఎవరికోసమంటే..?
ఈరోడ్ జిల్లాలోని సత్యమంగళం పులుల సంరక్షణ కేంద్రం పరిధిలోని అటవీ ప్రాంతాల్లో ఏనుగులు, చిరుతపులులు, ఎలుగుబంట్లు, అడవి దున్నలు వంటి అడవి జంతువులు పెద్ద సంఖ్యలో నివసిస్తున్నాయి.ఈ దట్టమైన అడవులను ఆవాసంగా చేసుకుని ఇవి జీవనం సాగిస్తున్నాయి. అయితే అర్థరాత్రి వేళల్లో ఇవి ఘాట్ రోడ్లపైకి వస్తుంటాయి. దీంతో వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. తాజాగా ఓ చిరుత పులి ఘాట్ రోడ్డు పక్కనే ఉన్న గుంతలో మాటేసింది.
సాధారణంగా క్రూర మృగాలు ఈ అడవి గుండా వెళ్లే దిండిగల్-మైసూర్ జాతీయ రహదారిని దాటుతూ ఉంటాయి. ఆ సమయంలో కొన్ని జంతువులు వాహనాలను ఢీకొని మృత్యువాత పడుతుండగా కొన్ని జంతువులు సాఫీగా రోడ్డును దాటేసి అడవిలోకి పరుగులు తీస్తాయి. మరికొన్ని జంతువులైతే వాహనదారులపై దాడికి యత్నిస్తుంటాయి. తాజాగా, పన్నారి అమ్మన్ ఆలయం నుంచి తింబం (Thimbam) ఘాట్ రోడ్డుకు వెళ్లే మార్గంలో ఓ చిరుతపులి పదునుగా మాటు వేయడం వాహనదారులను ఆశ్చర్యపరిచింది.

గుంతలో మాటు వేసిన చిరుత..
తింబం ఘాట్ రోడ్డు మార్గంలో అటవీ ప్రాంతానికి ఆనుకుని ఉన్న ఓ గుంతలో చిరుతపులి కాపు కాస్తూ కనిపించింది. దీన్ని చూసిన వాహనదారులు తమ మొబైల్ ఫోన్లలో వీడియో తీసేందుకు ప్రయత్నించారు.ఈక్రమంలోనే వారు చేస్తున్న శబ్దానికి ఉలిక్కిపడిన చిరుత వెంటనే గుంతలోంచి బయటకు వచ్చి,పరుగులు పెడుతూ అడవి లోపలికి పారిపోయింది.ఈ దృశ్యాన్ని అదే మార్గంలో వెళ్తున్న ఓ వాహనదారుడు తన మొబైల్‌లో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, ఆ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.
తింబం ఘాట్ రోడ్డులో వాహనదారులకు షాక్..!!#Leopard #TimbamGhatRoad #TamilnaduNews #ViralWatch #OIUpdates #Oneindiatelugu pic.twitter.com/K59Nhl6qdd
— oneindiatelugu (@oneindiatelugu) November 13, 2025
తింబం - మైసూర్ జాతీయ రహదారిపై అడవి జంతువుల సంచారం ఎక్కువగా ఉన్నందున, వాహనదారులు తమ వాహనాలను నెమ్మదిగా నడపాలని అటవీ శాఖ అధికారులు ఈ సందర్భంగా సూచించారు.












Click it and Unblock the Notifications