viral:ఏం అమ్మాయిలు రా నాయనా.. మందేసి చిందేసి, క్యాబ్ డ్రైవర్‌పై ప్రతాపం, ఖాకీపై కూడా

మందేస్తే అంతే సంగతులు.. అబ్బాయిలే ఆగరు.. మరీ అమ్మాయిల సంగతి ఏంటీ అని ఆలోచిస్తున్నారా..? కొందరు లేడీస్ కూడా అంతే.. నానా రచ్చ చేస్తారు. మహారాష్ట్రలో ఓ యువతి కూడా ఇలానే చేసింది. ఓలా క్యాబ్ డ్రైవర్‌కు చుక్కలు చూపించింది. ఇంతలో అక్కడికి వచ్చిన ఖాకీని కూడా వదల్లేదు. చెడుగుడు ఆడేసింది. ముగ్గురు అమ్మాయిలు.. అర్ధరాత్రి పూట బీభత్సమే చేశారు. వారికి సంబంధించి మొత్తం 11 వీడియోలు ఉండగా.. వాటిని ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఇంకేముంది తెగ వైరల్ అవుతుంది.

 పార్టీ నుంచి బయటకు వచ్చిన యువతులు

పార్టీ నుంచి బయటకు వచ్చిన యువతులు


మహారాష్ట్రలో ఘటన జరిగింది. ఎందుకంటే సదరు పోలీస్ వ్యక్తి డ్రెస్ మహారాష్ట్ర అని కోడ్ చేస్తోంది. ఏ ప్రాంతంలో అనే విషయం మాత్రం తెలియరాలేదు. ఆ వీడియోలు మాటలు కూడా మరాఠిలో వినిపిస్తున్నాయి. ముగ్గురు యువతులు పార్టీ నుంచి లేట్ నైట్ బయటకు వచ్చారు. క్యాబ్ బుక్ చేసుకున్నారు కావచ్చు.. ఇంకేముంది ఆ డ్రైవర్ వచ్చాడు. అతనితో ఏం జరిగిందో తెలియదు కానీ.. అందులో ఓ యువతి మాత్రం దానిని దూషించింది. దీంతో గొడవ మొదలైంది.

 డ్రైవర్‌ను నెట్టివేసి హంగామా

డ్రైవర్‌ను నెట్టివేసి హంగామా


ఆ డ్రైవర్‌ను కారు నుంచి నెట్టి వేసి హంగామా చేసింది. తర్వాత విషయం తెలిసిన పోలీసులు వచ్చారు. కానీ ఆ యువతి వినిపించుకోలేదు. అధికారినే బెదిరించే ప్రయత్నం చేసింది. పోలీస్ అధికారిని కూడా వార్నింగ్ ఇచ్చింది. అతను ఆమెను నెట్టివేయగా.. కాలితో తన్నింది. అలాగే అతని కాలర్ పట్టుకునే ప్రయత్నం చేసింది. అతని మాస్క్ తీసివేసి బయటకు విసిరేసింది. అధికారి దూరం జరిగి ఫోన్ మాట్లాడుతుండగా చెంప‌చెల్‌ అనిపించింది. ఆమె చేసిన చేష్టలు వీడియోలో రికార్డ్ అయ్యాయి.

వీడియో తీసే కెమెరా వద్దకు వచ్చి

వీడియో తీసే కెమెరా వద్దకు వచ్చి


వీడియో తీస్తోన్న కెమెరా వద్దకు కూడా వచ్చింది. పోలీసులు, మీడియా ఉన్న తనకు హానీ జరగదనే భరోసాతో ఉంది. ఆ వీధి నుంచి వెళ్లే వారిని అరుస్తూ కనిపించింది. తన పేరు చెప్పుకుని నవ్వుతూ వీడియోకు ఫోజు ఇచ్చింది. ఇదంతా జరుగుతున్న సమయంలో ఆమె స్నేహితుల్లో ఒకరు ఆపేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ తన ఫ్రెండ్‌నే ఓ దెబ్బ కొట్టింది. వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

 తలదించుకునేలా..

తలదించుకునేలా..


అమ్మాయి గురించి,ఆమె స్నేహితుల గురించి తెలిస్తే తిట్టుకుంటారని మరొ నెటిజన్ కామెంట్ చేశారు. వారు మాత్రం తలదించుకునేలా ఉందని రాశారు. వీరిని ఏమని పిలవాలి అని మరొకరు అడిగారు. సదరు పోలీసు అధికారిని యూజర్లు ప్రశంసిస్తున్నారు. అతని ఓర్పుగా ఉండి.. వారి చేష్టలను ప్రపంచానికి చూపారని వివరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+