షాకింగ్ వీడియో... అర్ధరాత్రి దానంతట అదే కదిలిన బైక్... ఇదెలా సాధ్యం...?

సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఓ వీడియో చాలామందిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మనిషి ప్రమేయం లేకుండా అర్ధరాత్రి సమయంలో ఓ బైక్ దానంతట అదే కదలడం చాలామందిని విస్మయపరుస్తోంది. గుజరాత్‌లో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. అంబర్ జైదీ అనే మహిళ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా విపరీతంగా వైరల్ అవుతోంది.

30 సెకన్ల నిడివి ఉన్న ఆ వీడియోలో బైక్ దానంతట అదే ముందుకు కదిలి యూ టర్న్ తీసుకుంటూ కింద పడిపోయింది. డిసెంబరు 30, అర్ధరాత్రి 01.03గం. సమయంలో ఈ ఘటన జరిగినట్లు సీసీటీవీ ఫుటేజీలో రికార్డయింది. ఆ దృశ్యాలను అంబర్ జైదీ ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ఆ వీడియోను గమనిస్తే.. ఓ గల్లీలో రెండు బైక్‌లు, ఓ సైకిల్ పార్క్ చేసి ఉన్నాయి. వీటిల్లో ఒక బైక్ మాత్రమే దానంతట అదే కదులుతూ ముందుకు వెళ్లి పడిపోయింది. ఈ వీడియోని చూసినవాళ్లంతా ఇదెలా సాధ్యమని తలలు బాదుకుంటున్నారు.

Viral Video Of Parked bike Moving On Its Own Intrigues Netizens

కొందరేమో ఇది దెయ్యం మహిమ అని కామెంట్స్ చేస్తుండగా... మరికొందరేమో ఎడిట్ చేసిన వీడియో అని,ఫేక్ అని కొట్టిపారేస్తున్నారు. ఇంకొందరేమో.. బండి స్టార్ట్ చేసి ఉండొచ్చు... అదే సమయంలో స్టాండ్ సరిగా వేసి ఉండకపోవచ్చు... అందుకే ముందుకు కదిలి ఉంటుందని అంటున్నారు. ఒకవేళ బైక్ లాక్ డ్యామేజ్ అయినా.. లేక లూజ్‌గా ఉన్నా.. ఇలా ముందుకు కదిలే అవకాశం ఉందని మరో నెటిజన్ కామెంట్ చేశాడు. ఎవరి కామెంట్స్ ఎలా ఉన్నా ఈ వీడియోలో అసలు రహస్యమేంటన్నది ఎవరికీ అంతుచిక్కడం లేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+