Viral video: టూరిస్ట్ వాహనాన్ని వెంబడించిన ఖడ్గ మృగం, హడలెత్తించింది

దిస్పూర్: అస్సాంలోని మానస్ నేషనల్ పార్క్‌లో ఒక ఖడ్గ మృగం పర్యాటకులను బెంబేలెత్తించింది. ఈ పార్కులో పర్యాటకులు ప్రయాణిస్తున్న వాహనాన్ని.. చెట్ల పొదల నుంచి వచ్చిన ఖడ్గ మృగం వెంబడించింది. చాలా దగ్గరకు రావడంతో ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు.

అయితే, ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని పార్క్ అధికారి ఒకరు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Viral video: Rhino Jumps Out Of Bush, Chases Tourist vehile In Assam

"ఈ ఘటన డిసెంబర్ 29న జరిగింది. ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు" అని మానస్ నేషనల్ పార్క్ ఫారెస్ట్ రేంజ్ అధికారి బాబుల్ బ్రహ్మ మీడియాకు తెలిపారు. ఈ వైరల్ వీడియోను అటవీ శాఖ ధృవీకరించింది.

అంతకుముందు నవంబర్‌లో అస్సాంలోని కజిరంగా నేషనల్ పార్క్‌లో ఒక కొమ్ము ఖడ్గమృగం దాడి చేయడంతో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. నేషనల్ పార్క్‌లోని కొహోరా అటవీ రేంజ్ పరిధిలోని బోర్‌బీల్ ప్రాంతంలో పార్క్ లోపల దెబ్బతిన్న రోడ్డు మరమ్మతు పనుల్లో నిమగ్నమై ఉండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

గాయపడిన వారిని నేషనల్ పార్క్‌లో ఫారెస్ట్ వర్కర్‌గా పనిచేస్తున్న బినోద్ సరో, స్థానిక యువకుడు జిబాన్ సరోగా గుర్తించారు. గాయపడిన వారిని కోహోరా సివిల్ ఆసుపత్రికి తరలించారు. బోర్‌బీల్ యాంటీ-పోచింగ్ క్యాంపు ప్రాంతంలో ఈ ఘటన జరిగిందని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ బిభూతి రంజన్ గొగోయ్ తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+